చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఇలాకాలో జగన్ కొత్త పెట్టుబడి - లాభం దక్కేనా: ఏం జరుగుతోంది..!!

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో పాగా వేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ స్థానంలో విజయం సాధించడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కుప్పం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

విజయశాంతికి పోటీగా జయసుధ: పార్టీలో ఎంట్రీ ఖాయం: కండీషన్స్ అప్లై..!!విజయశాంతికి పోటీగా జయసుధ: పార్టీలో ఎంట్రీ ఖాయం: కండీషన్స్ అప్లై..!!

2024 ఎన్నికల్లో కుప్పం పార్టీ ఇన్‌ఛార్జ్ భరత్ కుమార్‌ విజయం సాధిస్తే- మంత్రి పదవి సైతం ఇస్తానని మాటిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిని క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంది. ఈ ఎన్నికలు ఇచ్చిన ఊపుతో ఇక అసెంబ్లీ స్థానంపై దృష్టి సారించింది. ఈ సారి గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది.

AP govt released the funds of Rs 66 Cr to Kuppam, which is own Assembly seat of Chandrababu

Recommended Video

మనసున్న నేత వైఎస్ జగన్ అంటున్న టీడీపీ MLA *Politics | Telugu OneIndia

అందులో భాగంగా వైఎస్ జగన్.. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారు. వాటిని కార్యాచరణలోకి తీసుకొస్తోన్నారు. తాజాగా కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఈ నిధులను వ్యయం చేయనుంది. 66 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మున్సిపల్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో ఇచ్చారు.

ఇదివరకు గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది జగన్ ప్రభుత్వమే. కుప్పం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తానంటూ ఇదివరకు ఆ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. కుప్పం మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సరఫరా, పార్క్లు, మున్సిపల్ కార్యాలయానికి కొత్త భవనం, స్మశాన వాటిక కోసం ఈ నిధులను ఖర్చు చేయాలని మున్సిపల్ మంత్రిత్వ శాఖ సూచించింది.

English summary
AP govt released the funds of Rs 66 Cr to Kuppam, which is own Assembly constituency of TDP Chief and Opposition leader Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X