చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుప్పంపై వైసీపీ తారకమంత్రం - వర్కవుట్..!!

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో పాగా వేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ స్థానంలో విజయం సాధించడానికి కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించనున్నారు.

కుప్పం టార్గెట్‌గా..

కుప్పం టార్గెట్‌గా..


కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారు. వాటిని తక్షణమే కార్యాచరణలోకి తీసుకొస్తోన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేశారు. ఇక కుప్పం పర్యటనకూ వైఎస్ జగన్ పూనుకున్నారు. ఈ నెల 22వ తేదీన ఆ నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. మూడో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని చంద్రబాబు గడ్డ మీదే ప్రారంభించనున్నారాయన.

 175 టార్గెట్ అక్కడి నుంచే..

175 టార్గెట్ అక్కడి నుంచే..


రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా క్లీన్ స్వీప్ చేయాలనేది వైఎస్ జగన్ లక్ష్యం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. ఆ లక్ష్యానికి తొలి అడుగు కుప్పం నుంచే ఆరంభం కావాలని భావిస్తోన్నారు. దీనికి అనుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. జిల్లాల పర్యటనను కుప్పం నుంచే ఆరంభించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

 జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై..

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై..

తన వ్యూహాలకు మరింత పదును పెట్టింది వైఎస్ఆర్సీపీ. కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై కన్నేసింది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు సారథ్యాన్ని వహించడాన్ని వ్యతిరేకిస్తోన్న జూనియర్ అభిమానులను చేరదీసే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా- ఇప్పటికే కొన్ని కీలక మండలాలకు చెందిన అభిమానులను పార్టీలో చేర్చుకున్నట్లు చెబుతున్నారు.

 జూనియర్ చేతికి టీడీపీ..

జూనియర్ చేతికి టీడీపీ..

నారా సారథ్యం నుంచి తప్పించి తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ కుప్పం నియోజకవర్గం పరిధిలో బలంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. జూనియర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించాలంటూ ఇదివరకు ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. చంద్రబాబు సమక్షంలోనే తమ గళాన్ని వినిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వారందరినీ వైసీపీ చేరదీస్తోంది. పార్టీ కండువా కప్పుతోంది.

 మోహరించిన మంత్రులు..

మోహరించిన మంత్రులు..


22వ తేదీన వైఎస్ జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పలువురు మంత్రులు కుప్పంలో మోహరించారు. విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. వైఎస్ జగన్ బహిరంగ సభ ముగిసేంత వరకూ జిల్లాలోనే ఉండనున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మంత్రులు ఆర్ కే రోజా, ఉష శ్రీచరణ్ కూడా కుప్పంలో పర్యటించారు. ఎంపీ రెడ్డెప్ప సహా పలువురు ఎమ్మెల్యేలు కుప్పంలో మోహరించారు.

English summary
CM YS Jagan new strategy to get Kuppam, Which is bastin of TDP Chief Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X