చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెప్పు తెగేలా కొట్టినా మారని అధికారి.. మహిళా డాక్టర్ ను ఎలా వేదిస్తున్నాడో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

తనను లైంగిక వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారిని ఓ మహిళా డాక్టర్ ప్రతిఘటించింది. కూతురు వయసున్న తనను ఉన్నతాధికారి ఫోన్లో వేధింపులకు గురిచేయడంతో చెప్పుతో సమాధానం చెప్పింది. ఇంతా జరుగుతున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఈ వ్యవహారంలో మీనమేషాలు లెక్కిస్తోంది. తన విషయంలో జరిగిన దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే అంటోంది మహిళా డాక్టర్ .

పిల్లల్ని కనటం మహిళ ఇష్టం .. అబార్షన్ పై ఆంక్షలు ఎత్తెయ్యాలని సుప్రీంలో పిల్పిల్లల్ని కనటం మహిళ ఇష్టం .. అబార్షన్ పై ఆంక్షలు ఎత్తెయ్యాలని సుప్రీంలో పిల్

చిత్తూరు జిల్లా క్షయ నివారణ శాఖలో ముదురుతున్న మహిళా డాక్టర్ లైంగిక వేధింపుల వివాదం

చిత్తూరు జిల్లా క్షయ నివారణ శాఖలో ముదురుతున్న మహిళా డాక్టర్ లైంగిక వేధింపుల వివాదం

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జిల్లా క్షయ నివారణ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా వైద్యురాలిని ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆ అధికారిని ప్రశ్నించడానికి మహిళా డాక్టర్ తల్లి వచ్చింది. ఆమెపై అతను దాడికి యత్నించడంతో తనని వేధింపులకు గురి చేస్తున్న డాక్టర్ రమేష్ బాబు ను మహిళా డాక్టర్ చెప్పు తెగేలా కొట్టింది. అయినా తన వైఖరి మార్చుకుని రమేష్ బాబు ఇంత జరిగిన తర్వాత కూడా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. జిల్లా క్షయ నివారణ శాఖలో లైంగిక వేధింపుల వివాదం ముదురుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం దున్నపోతు మీద వాన కురిసిన చందంగా ప్రవర్తిస్తోంది.

చెప్పుతో కొట్టినా మారని ఉన్నతాధికారి .. బయోమెట్రిక్ లో హాజరు వెయ్యకుండా ఇబ్బంది

చెప్పుతో కొట్టినా మారని ఉన్నతాధికారి .. బయోమెట్రిక్ లో హాజరు వెయ్యకుండా ఇబ్బంది

వేధింపులకు గురిచేసిన అధికారికి చెప్పుతో సమాధానం చెప్పిన మహిళా డాక్టర్ సోమవారం విధులకు హాజరు కావడంతో బయోమెట్రిక్ లో ఆమెకు హాజరు వేయకుండా ఇబ్బందులకు గురి చేశారు సదరు ఉన్నతాధికారి. అంతేకాదు పది రోజుల పాటు సెలవు పై వెళ్లాలని, ఎవరైనా అడిగితే ఏదో ఫ్రస్ట్రేషన్ అలా చేశానని చెప్పండి అంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆమె ససేమిరా అనడంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెకు బయోమెట్రిక్ ను, హాజరు పట్టిని అందుబాటులో ఉంచక తప్పలేదు. వేధింపులకు గురి చేస్తున్న డాక్టర్ ను చెప్పుతో కొట్టినా బుద్ధి రాలేదని అతని తీరు ఏమాత్రం మార్పు రాలేదని మహిళా డాక్టర్ లబోదిబోమంటోంది .

కలెక్టర్ కు ఫిర్యాదు చెయ్యనున్న మహిళా డాక్టర్ .. న్యాయం కోసం పోరాటం

కలెక్టర్ కు ఫిర్యాదు చెయ్యనున్న మహిళా డాక్టర్ .. న్యాయం కోసం పోరాటం

పట్టించుకోవాల్సిన, చర్యలు తీసుకోవాల్సిన శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తే ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని అటు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా డాక్టర్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఉన్నతాధికారి పై తక్షణం చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి .

ఉన్నతాధికారి వ్యవహారంపై మహిళా డాక్టర్ కలెక్టర్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని వదిలేది లేదని ఆమె తేల్చి చెబుతున్నారు. తనను ఉన్నతాధికారి వేధింపులకు గురిచేసిన అన్ని ఆధారాలను కలెక్టర్ కు అందించి న్యాయం చేయాలని, అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు సదరు మహిళా డాక్టర్.

English summary
A woman doctor's mother has come to question the official after a senior doctor who works in the district's Tuberculosis Department at Chittoor Government Hospital premises has been sexually abused. As he attempts to attack her, Dr. Ramesh Babu, who is harassing her, is slapped with slipper by a female doctor. However, Ramesh Babu does not changed his attitude and continues to embarrass her even after this happened.The District Medical Health Department is not concerned with the Sexual Assault Controversy in the District Tuberculosis Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X