Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: స్వగ్రామానికి లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహం: వేలాదిమందితో

చిత్తూరు: తమిళనాడులోని సుళ్లూరు-కూనూర్ మధ్య సంభవించిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో కన్నుమూసిన లాన్స్ నాయక్ బీ సాయితేజ పార్థివదేహం చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం ఎగువరేగడకు చేరుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావాత్ సహా 13 మంది కన్నుమూశారు. 2012లో ఆర్మీలో చేరిన బీ సాయితేజ.. బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతాధికారి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కేప్టెన్ వరుణ్ సింగ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బెంగళూరులోని కమాండెంట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

దేశ రాజధాని నుంచి సాయితేజ పార్థివ దేహం ప్రత్యేక విమానంలో శనివారం రాత్రి బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది. ఈ ఉదయం రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలించారు ఆర్మీ అధికారులు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని చీకటిబైలు చెక్‌పోస్ట్ మీదుగా ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తరలించారు. దేశ రక్షణలో ప్రాణాలను అర్పించిన సాయితేజకు పార్థివ దేహానికి అంతిమ వీడ్కోలు పలికడానికి వేలాదిమంది ఆయన స్వగ్రామానికి చేరుకుంటున్నారు.

వేలాదిమంది స్థానికులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. భరత మాతకు జై అంటూ నినదిస్తోన్నారు. సాయితేజకు జోహార్లు అర్పిస్తున్నారు. సాయితేజ పార్థివదేహం చిత్తూరు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచీ వాహనం ముందు బైక్‌లతో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలను చేత పట్టుకుని సాయితేజకు నివాళి అర్పిస్తున్నారు. ఈ మార్గం మొత్తం క్రిక్కిరిసిపోయింది. ఈ సాయంత్రం ఆయన పార్థివ దేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

Thousands participated in the last journey of Lance NaiK B Sai Teja in Chittoor

కుటుంబ సభ్యులు, ప్రజల సందర్శనం కోసం మధ్యాహ్నం వరకు ఆయన ఇంట్లో పార్థివదేహాన్ని ఉంచుతారు. అనంతరం అదే గ్రామంలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదం అనంతరం పార్థివ దేహాలు గుర్తు పట్టకపోవడం వల్ల డీఎన్ఏ పరీక్షలను నిర్వహించారు ఆర్మీ అధికారులు. ఢిల్లీలోనే ఈ ప్రక్రియ సాగింది. డీఎన్ఏ పరీక్షలో సాయితేజ పార్థివ దేహాన్ని గుర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు నివాళి అర్పించిన తరువాత.. స్వగ్రామానిిక తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+