చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ ... హెల్మెట్ లేకుండా కార్ డ్రైవింగ్ చేశారని ఫైన్..పోలీసులా మజాకా

|
Google Oneindia TeluguNews

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించిన వారికి ఫైన్ వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కోసారి తప్పులో కాలేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించకున్నా చాలామందికి చలాన్లు పంపిస్తున్నట్లు వాహనదారులు లబోదిబోమంటున్నారు.

తిరుమ‌ల: ఐఆర్ సీటీసీ.. పైస్ జెట్: ఒక రాత్రి, రెండు ప‌గ‌ళ్లుతిరుమ‌ల: ఐఆర్ సీటీసీ.. పైస్ జెట్: ఒక రాత్రి, రెండు ప‌గ‌ళ్లు

హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడిపితే ఫైన్ వేయటం మామూలే. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేస్తే ఫైన్ వేస్తారా ? అంటే అవును అది కూడా జరుగుతుంది అని చెప్తున్నారు వాహనచోదకులు. హెల్మెట్ పెట్టుకోకుండా కార్ డ్రైవ్ చేశాడంటూ ఫైన్ వేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ట్రాఫిక్ పోలీసులు. సాధారణంగా కార్ల విషయంలో సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలనేది రూల్. కారు నడిపే వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడిపితే ఫైన్ వేస్తారు కానీ ఏపీలో చిత్తూరు జిల్లా పోలీసులు కారు నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కారు నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదంటూ చలాన్ పంపించారు. అది చూసిన సదరు వాహన చోదకుడికి నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి .

traffic cops fine you for not wearing helmet while driving a car

'ఏపీ 03 బీజెడ్ 7345' అనే నంబర్ కారుపై హెల్మెట్ లేకుండా వెళుతున్నారని చెబుతూ రూ. 135 జరిమానా చెల్లించాలని కారు యజమానికి ఈ-చెలాన్ పంపించారు ట్రాఫిక్ పోలీసులు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు దీన్ని జారీ చేశారు. ఫిబ్రవరి14 రాత్రి పానగల్ సమీపంలో దీన్ని గుర్తించామనీ..మార్చి 1లోపు ఫైన్ కట్టాలని కూడా చలానా నోటీస్ లో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వెహికల్ గల వ్యక్తి మాత్రం తాను నడిపింది బైక్ కాదనీ..కారు అని..గురువారం రాత్రి తానసలు అటువైపే పోలేదనీ తనకు తప్పుగా చలానా జారీ చేశారని లబోదిబోమంటున్నారు.

ఇది టెక్నాలజీ లోపమా..లేదా పోలీసులు నిర్వాకమా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఉదంతం తెలిసిన వారు పోలీసులా మజాకా అని ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వ్యవహారంపై వాహనచోదకులు మండిపడుతున్నారు. సదరు వాహనచోదకుడు తన తప్పు లేదు కాబట్టి ఈ చలాన్ విషయంలో ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి చలాన్ రద్దు కోసం ప్రయత్నం చేస్తాడా లేకా పోలీసులు చుట్టూ తిరిగే రిస్క్ తీసుకోలేక 135 రూపాయలు చెల్లించి కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేసిన పోలీసుల నిర్వాకాన్ని తిట్టుకుంటూ లైట్ తీసుకుంటాడా అనేది మాత్రం ఆసక్తిదాయకమే.

English summary
Can traffic cops fine you for not wearing helmet while driving a car? No. But in Andhra Pradesh at Chittor district A man was fined 135 rupees by the Srikalahasti rural police . allegedly for not wearing a helmet while driving his car AP 03 BZ 7345 near Panagal on February 14th night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X