బాగా బలిసిన కోడి... చికెన్‌ షాపు ముందు తొడగొడితే ఏమవుతుందో అదే అయ్యింది : లోకేష్ నుద్దేశించి రోజా

Recommended Video

    Abolish of AP Legislative Council : Roja Sensational Comments Over Council Cancellation || Oneindia

    నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా మండలి రద్దు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాను మండలి రద్దు చేయాలని కోరతానని ఆమె పేర్కొన్నారు. టిడిపి కారణంగా శాసన మండలిలో విలువలు దెబ్బతిన్నాయని రోజా అన్నారు. ప్రజాతీర్పును శాసనమండలి గౌరవించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

    అభివృద్ధి నిరోధకంగా ఉన్న మండలిని ఉంచాల్సిన అవసరం లేదన్న రోజా

    అభివృద్ధి నిరోధకంగా ఉన్న మండలిని ఉంచాల్సిన అవసరం లేదన్న రోజా

    ఇక శాసనమండలి పెద్దలు సలహాలు ఇవ్వాలి కానీ బిల్లులు ఆపడం సరికాదని వ్యాఖ్యానించారు. మండలి గ్యాలరీ లో కూర్చుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చైర్మన్ ను బెదిరించి తమకు అనుకూలంగా వ్యవహరించేలా చేశారని ఆమె ఆరోపించారు. అభివృద్ధి నిరోధకంగా ఉన్న మండలిని ఉంచాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. లోకేష్ తీరు చాలా విచిత్రంగా ఉందని పేర్కొన్న రోజా, మండలిలో ఏదో సాధించినట్లు బయటకొచ్చి తొడగొట్టి సవాల్ చేస్తున్నారని మండిపడ్డారు.

    వ్యక్తిగతంగా నా అభిప్రాయం శాసనమండలి రద్దు చేయాల్సిందే

    వ్యక్తిగతంగా నా అభిప్రాయం శాసనమండలి రద్దు చేయాల్సిందే

    బాగా బలిసిన కోడి చికెన్‌ షాపు ముందు తొడగొడితే ఏమవుతుందో నారా లోకేష్ తెలుసుకోవాలన్నారు. అలాంటి కోడిని కోసి ఉప్పు కారం పెట్టి కూర వండేస్తారు అని వ్యాఖ్యానించారు. ఇక నా వ్యక్తిగతంగానైతే శాసనమండలి రద్దు చేయాల్సిందేనని రోజా అభిప్రాయపడ్డారు. అంతే కాదు చంద్రబాబు రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని పేర్కొన్న రోజా, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తుంటే దాని పైన కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారని ఫైర్ అయ్యారు.

    వైసిపి ప్రభుత్వానికి పట్టం కట్టినా కూడా అభివృద్ధి చేయలేకపోతే ఎలా?

    వైసిపి ప్రభుత్వానికి పట్టం కట్టినా కూడా అభివృద్ధి చేయలేకపోతే ఎలా?

    ఇక యనమల రామకృష్ణుడు పై ఫైర్ అయిన రోజా యనమలను రెండు సార్లు, ఆయన తమ్ముడిని రెండు సార్లు ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదు అని గుర్తు చేశారు. ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చి వైసిపి ప్రభుత్వానికి పట్టం కట్టినా కూడా అభివృద్ధి చేయలేకపోతే ఎలా అని రోజా మాట్లాడారు. అందుకే అభివృద్ధి నిరోధకంగా ఉన్న దేన్నైనా పక్కకు తప్పించాల్సిందే అని రోజా అభిప్రాయపడ్డారు. మండలి రద్దు చేయడం సరైన నిర్ణయమని రోజా వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+