Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డిశ్చార్జ్‌ తర్వాత తొలిసారి కనిపించిన రోజా- వీడియో సందేశం-దుమ్మురేపాలంటూ

ఏపీలో గత నెలలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం అందించిన తర్వాత అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రోజా ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆమె మీడియాకు దర్శనమిచ్చారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరోసారి వైసీపీకి ఘన విజయం కట్టబెట్టాలంటూ ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక రోజా తొలిసారి బయటికి కనిపించడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 సర్జరీల తర్వాత కోలుకుంటున్న రోజా

సర్జరీల తర్వాత కోలుకుంటున్న రోజా

తాజాగా చెన్నె ఆస్పత్రిలో రెండు సర్జరీలు చేయించుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ మధ్యే డిశ్చార్జ్‌ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగానే ఇంటికి చేరుకున్న ఆమె ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించడమే కాకుండా సొంత నియోజకవర్గం నగరిలో ప్రత్యర్ధుల్ని తుడిచిపెట్టిన రోజాకు త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ విజయం కూడా కీలకంగా మారింది. దీంతో ఆమె ఇంటి నుంచే నేతల్ని సమన్వయం చేస్తున్నారు.

డిశ్చార్జ్‌ తర్వాత తొలిసారి కనిపించిన రోజా

డిశ్చార్జ్‌ తర్వాత తొలిసారి కనిపించిన రోజా


ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రోజా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. దీంతో ఇంటి నుంచే నేతల్ని సమన్వయం చేసుకుంటూ విజయానికి బాటలు వేస్తున్న రోజా ఇవాళ తొలిసారి వీడియోలో దర్శనమిచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత తాను ఎలా ఉన్నానని ఆందోళన చెందుతున్న అభిమానులకు ఊరటనిచ్చేలా రోజా ఇందులో కనిపించారు. గతంలోలా ఉత్సాహంగా మాట్లాడుతూ రోజా ఇచ్చిన సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది.

జగన్‌కూ, అభిమానులకూ రోజా థ్యాంక్స్‌

జగన్‌కూ, అభిమానులకూ రోజా థ్యాంక్స్‌

చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నా, మేజర్ ఆపరేషన్‌ జరగడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయాను, నా కోసం ప్రార్ధించిన వారికి, నా ఆరోగ్యం కోసం ధైర్యం చెప్పిన జగనన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు రోజా తెలిపారు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినందున తాను ఇంటికే పరిమితమైనట్లు వీడియోలో రోజా వెల్లడించారు. రెండేళ్లలో జగన్‌ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నిలబెట్టుకున్నారని రోజా ఓటర్లకు గుర్తుచేశారు. కాబట్టి మరోసారి వైసీపీని గెలిపించి అండగా నిలవాలని కోరారు.

తిరుగులేని మెజారిటీతో దుమ్మురేపాలని కోరిన రోజా

త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తరహాలోనే వైసీపీకి మరో ఘన విజయం కట్టబెట్టాలని ఓటర్లకు రోజా విజ్ఞప్తి చేశారు. గతంలో పంచాయతీ, మున్సిపల్ పోరులో భారీ విజయాలు ఇచ్చారని, ఇప్పుడు మరోసారి పరిషత్‌ పోరులోనూ వైసీపీ అభ్యర్ధుల్ని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండు ఓట్లూ ఫ్యాన్ గుర్తుకే వేసి తిరుగులేని మెజారిటీతో దుమ్మురేపాలని రోజా విజ్ఞప్తి చేశారు. కీలకమైన ఎన్నికల వేళ ప్రచారానికి దూరం కావడంతో ఇంటి నుంచే ఓటర్లకు తన సందేశాన్ని రోజా పంపించారు. ఈ వీడియోను తన నియోజవర్గంలో ఓటర్లకు చేరవేయాలని నేతల్ని రోజా కోరినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+