రాజమండ్రి పాస్టర్‌: ప్రార్థనల కోసం వెళ్తే..న్యూడ్ వీడియోలు తీశాడు: యువతికి అండగా కరాటే కల్యాణి

రాజమహేంద్రవరం: కొన్నేళ్ల పాటు కేరళను కుదిపేసిన పాస్టర్ లైంగిక వేధింపులు, హత్య కేసు తరహాలోనే ఏపీలో మరో ఉదంతం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ పాస్టర్.. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం ముఖం చాటేశాడు. పెళ్లి మాటెత్తిన బాధితురాలికి సంబంధించిన నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసేవాడు. పెళ్లి పేరుతో తనను మోసం చేసిన పాస్టర్‌పై బాధితురాలు రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో బాధితురాలికి సినీ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కరాటే కల్యాణి అండగా నిలిచారు.

బాధితురాలి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కడియం. రాజమండ్రి ఆల్కట్‌తోట ప్రాంతంలోని ఓ చర్చికి ఆమె తరచూ ప్రార్థనల కోసం వెళ్లేవారు. చర్చి పాస్టర్ షారోన్‌ కుమార్‌‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని పాస్టర్..తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శారీరకంగా లోబరచుకున్నాడు. కొంతకాలంగా తరువాత ముఖం చాటేశాడు. ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె చర్చికి వెళ్లి.. పాస్టర్‌ను నిలదీశారు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారు. దీనితో అతను.. బాధితురాలికి సంబంధించిన నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు దిగాడు. చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

harassment case registered against a Pastor in Rajahmundry

అతని బెదిరింపులకు భయపడి బాధితురాలు హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ కరాటే కల్యాణిని కలిసి, పాస్టర్ దుర్మార్గం గురించి ఆమెకు వివరించారు. తొలుత షీ-టీమ్స్‌ను సంప్రదించారు. షీ టీమ్స్ ఇచ్చిన సూచనల ప్రకారం.. రాజమండ్రి రెండో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాస్టర్‌ నుంచి తాను ఎదుర్కొన్న వేధింపులను ఆమె ఫిర్యాదులో పొందుపరిచారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కరాటే కల్యాణి భరోసా ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాస్టర్ అజ్ఙాతంలో ఉన్నాడని, అతని గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+