వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Health News: కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. ఎందుకంటే..!

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ప్రతి కూరలో కరివేపాకు వేసుకుంటాం. ముఖ్యంగా సాంబార్, రసంలో తప్పకుండా కరివేపాకు వేస్తుంటారు. అయితే చాలా మంది తినేటప్పుడు కరివేపాకు వస్తే తీసి పారేస్తారు. కానీ.. కరివేపాకు ఉపయోగాలు తెలిస్తే అస్సలు అలా చేయరు. కరివేపాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు కుర్రల్లోనే కాదు పచ్చిగా కూడా తినడం మంచిదేనట. కరివేపాకులో విటమిన్ సి, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి.

కార్బజోల్ ఆల్కలాయిడ్లు

కార్బజోల్ ఆల్కలాయిడ్లు


కరివేపాకు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందట. కరివేపాకులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్లు బరువు పెరగడాన్ని నియంత్రిస్తాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడతాయట.కరివేపాకు నీరు తాగడం వల్ల శరీరం నుండి విషతుల్య పదార్థాలు బయటకు వెళ్లిపోతాయట. చర్మ వ్యాధులు, చర్మ సమస్యలు, ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని కూడా కరివేపాకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి


పని ఒత్తిడి, టెన్షన్‌, డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యలతో బాధపడేవారికి కరివేపాకు నీళ్లు దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు.ఇది ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తుందట. కరివేపాకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కరివేపాకును కడుపునొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారట. కరివేపాకును మజ్జిగలో కలిపి తాగడం వల్ల కడుపు నొప్పితో పాటుగా విరేచనాలు, మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలన్నీ వెంటనే తగ్గిపోతాయని చెబుతన్నారు.

వికారం, అలసట

వికారం, అలసట


గర్భం దాల్చిన ఆరు నెలల దాకా వాంతులు, వికారం, అలసట వంటి సమస్యలు ఉంటే కరివేపాకు తింటే మంచిదట. కరివేపాకు పొడిని తీసుకోవడం వలన నోటి అల్సర్ సమస్య తగ్గుతుందట. శరీరంలో ఇన్ఫెక్షన్లు లేదా ఆక్సీకరణ నష్టం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకులో లినోలోల్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఈ సమ్మేళనాల వల్లే కరివేపాకు రుచిగా ఉంటుంది. ఈ సమ్మేళనాలకు బ్యాక్టీరియాను నాశనం చేసే లక్షణాలు కూడా ఉంటాయట.

కంటి చూపు

కంటి చూపు


కరివేపాకు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో కంటికి మేలు చేసే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి సమస్యలు తగ్గుతాయి. కరివేపాకు మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.

English summary
Eating curry leaves has many benefits for the body besides boosting immunity. It is possible to lose weight if you eat curry leaves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X