Lemon Benefits: నిమ్మకాయ తినడం లేదా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!
మనకు సమృద్ధిగా లభించే వాటిలో నిమ్మకాయ ఒకటి. ఇది ధనిక, బీద తేడా లేకుండా వాడొచ్చు. ఈ నిమ్మకాయ వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయ, రూటేసి కుటుంబానికి చెందిన మంచి పండు. నిమ్మకాయ మాడరిన్, సిట్రాన్ వంటి అడవి సిట్రస్ జాతుల నుండి రూపొందిన ఒక మిశ్రజాతి (హైబ్రిడ్). క్రిస్టోఫర్ కొలంబస్ 1493 లో తన ప్రయాణంలో నిమ్మ గింజలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ప్రవేశపెట్టాడని చరిత్ర చెబుతుంది.

నిమ్మరసం
నిమ్మకాయ సగం నిమ్మచెక్క రసం తీసుకున్నా రోజుకు అవసరమైన విటమిన్ సిలో ఆరో వంతుకు పైగా శరీరానికి చేరుతుందట. నిమ్మకాయ రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది. నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం.

వెల్లుల్లి, ఉల్లిపాయలు
అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ ఇది తోడ్పడుతుందట. నూనె పదార్థాలు, మటన్, చెకెన్ తిన్నప్పుడు నిమ్మరసం తాగితే ఆహారం త్వరగా జీర్ణవుతుందట. నిమ్మకాయ శరీరం లోపలే కాదు బయట కూడా ఉపయోగపడుతుంది.వెల్లుల్లి, ఉల్లిపాయలు లేదా చేపలు వంటి బలమైన వాసనలతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల కలిగే దుర్వాసనకు నిమ్మకాయ నివారిస్తుంది. మీరు భోజనం తర్వాత ఉదయం ఒక గ్లాసు నిమ్మకాయ నీరు త్రాగడం ద్వారా నోటి దుర్వాసనను నివారించవచ్చు.

పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు
నిమ్మకాయల్లో ఉండే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు బరువు పెరగకుండా చేస్తాయి. అలాగే మన వంట పాత్రలు కడగడానికి కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. నిమ్మకాయనే కాదు నిమ్మకాయ ఆకులతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయ ఆకుల్లో యాంటీ వైరల్, ఆల్కలాయిడ్, యాంటీ ఆక్సిడెంట్, టానిన్, ఫ్లేవనాయిడ్, ఫినోలిక్ మూలకాలు ఉంటాయి. ఈ ఆకుల్లో ప్రోటీన్ కంటెంట్ తో పాటుగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కూడా ఉంటాయట. మైగ్రేన్ నొప్పితో బాధపడేవారికి నిమ్మకాయ ఆకులు మంచి మెడిసిన్ లా ఉపయోగపడతాయి. ఈ నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి.. యాంటీ ఆక్సిడెంట్ శరీర ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మైగ్రేన్ నొప్పి కూడా తగ్గుతుందట.

నిద్రలేమి సమస్య
నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి నిమ్మకాయ ఆకులు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. పలు అధ్యనాల్లో కూడా ఇది తేలింది. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆల్కలాయిడ్లు నిద్రలేమి, నిద్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడతాయట. ఓవర్ వెయిట్ తో బాధపడేవారికి కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మఆకులతో తయారుచేసిన జ్యూస్ ను తాగితే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications