వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Turmeric Side Effects: పసుపు ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

|
Google Oneindia TeluguNews

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపును మనం వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా కూరల్లో పసుపు తప్పనిసారిగా వాడతాం. మరోవైపు, రోగనిరోధక శక్తిని పెంచడానికి పసుపు పాలు, పసుపు నీరు మరియు పసుపు కషాయం వంటి పానీయాలు తీసుకుంటారు. పసుపులో యాంటీసెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీఫంగల్‌ వంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

తలనొప్పి

తలనొప్పి

పసుపు వ్యాధులను నయం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. మధుమేహం, ఒత్తిడి, ఆల్జీమర్స్ వంటి ఎన్నో రోగాల్ని తగ్గించే గుణం పసుపులో ఉంది. అయితే పసుపును అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పి, అలసట అనుభూతి కలుగుతుందట.

కిడ్నీలో రాళ్లు

కిడ్నీలో రాళ్లు


పసుపును అధికంగా తీసుకోవడం వల్ల దానిలో ఉండే ఆక్సలేట్ పరిమాణం మన కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుందట. పెద్ద మొత్తంలో పసుపు తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. అయితే, అటువంటి పరిస్థితి చాలా అరుదు.
పసుపులో ఉండే కర్కుమిన్.. పొట్టలోని గ్యాస్ట్రిక్ డక్ట్ సరిగా పనిచేయకుండా చేస్తుంది, దీని కారణంగా డయేరియా వచ్చే అవకాశం ఉంది.

ఐరన్

ఐరన్


మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదం మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి రక్తాన్ని పల్చగా ఉంచడానికి కూడా మందులు ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, పసుపు అధిక వినియోగం శరీరంలో రక్తాన్ని తగ్గిస్తుంది. పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉందట.

English summary
Experts say that consuming too much turmeric can lead to many problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X