వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Drumstick Leaves Benefits: షుగర్ తో బాధపడుతున్నారా.. అయితే మునగ ఆకుతో ఇలా చేయండి..

|
Google Oneindia TeluguNews

మనకు లభించే సహజ ఆహార పదార్థాల్లో మునగ ఒకటి. ఈ మునగ ఆకులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. మునగ ఆకులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మునగ కషాయాన్ని ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది దంతాలు దృఢంగా మారడంలో సహాయం చేస్తుంది.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

కడుపు నొప్పి, కడుపు పూతలకి మునగ ఆకుల రసం ఎంతో ఉపయోగపడుతుంది. మునగ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గొచ్చని నిపుణులు వివరిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది.

షుగర్‌

షుగర్‌


వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్‌ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 422 మిలియన్ల మంది డయాబెటిస్‌‌‌ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా .
ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది చనిపోతున్నారు. మునగ ఆకు షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చక్కర స్థాయి

చక్కర స్థాయి


ఇది రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తుందట. షుగర్‌ పేషెంట్స్‌ మునగ ఆకు పొడి, మునగ ఆకు టీ తీసుకుంటే డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. మునగా ఆకు అందుబాటులో లేకపోతే.. దాని ట్యాబ్లెట్స్‌ కూడా తీసుకోవచ్చుట. మునగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలని దృఢంగా ఉంచుతుంది.

English summary
Munaga leaf has many benefits for the body. Munaga leaves are especially useful in reducing diabetes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X