వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: తరచూ తలనొప్పా? ఈ పనిచేస్తే తలనొప్పి మాయం; మీ వల్ల అవుతుందా!!

|
Google Oneindia TeluguNews

మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి ప్రభావం ఎక్కువమందిని తలనొప్పి బాధితులుగా మారుస్తుంది. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది? తలనొప్పి రావడానికి కారణాలు ఏమిటి? తలనొప్పి ఎన్ని రకాలుగా ఉంటుంది? తలనొప్పి తగ్గటానికి చెయ్యల్సింది ఏమిటి? అనే వివరాలు తెలుసుకుంటే, కొన్ని రకాల తలనొప్పులను రాకుండా ముందు జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది. ఇక తలనొప్పి కారణాల గురించి, తలనొప్పి వస్తే ఏం చెయ్యాలో కూడా ఎవరికి తలనొప్పి కలిగించకుండా అసలు విషయానికి వస్తే..

తలనొప్పులు రెండు రకాలు.. ప్రైమరీ హెడేక్స్ తో ప్రమాదం లేదు

తలనొప్పులు రెండు రకాలు.. ప్రైమరీ హెడేక్స్ తో ప్రమాదం లేదు

తలనొప్పులు రెండు రకాలుగా ఉంటాయి. ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్, సాధారణంగా తలనొప్పులలో 90 శాతం నొప్పులు ప్రైమరీ హెడేక్స్ అని చెబుతారు. ప్రైమరీ హెడేక్ అంటే తల చుట్టూ ఉండే కండరాలు, రక్తనాళాలలో, నరాలలో ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వచ్చే తలనొప్పిని ప్రైమరీ హెడేక్ అంటారు. ఇవి ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య వారికి వస్తూ ఉంటాయి. వీటితో ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇవి తరచూ వస్తూ పోతూ ఉంటాయి.

తలనొప్పి లక్షణాలు ఇవే

తలనొప్పి లక్షణాలు ఇవే

ఇక సెకండరీ హెడేక్స్ విషయానికి వస్తే ఇవి ఇతరత్రా అనారోగ్య సమస్యలతో వచ్చేటువంటి తలనొప్పులు. వీటి ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది. ఈ తలనొప్పి విషయంలో వైద్యులను సంప్రదించటం తప్పనిసరి. సాధారణంగా వచ్చే ప్రైమరీ తలనొప్పుల లక్షణాలను చూస్తే తలనొప్పి వచ్చినవారికి అలసట ఎక్కువగా ఉంటుంది. చిరాకుగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి అనిపిస్తుంది. నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఒక్కోసారి అతి నిద్ర వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఎక్కువగా ఏడ్చినా, ఎక్కువగా ఆందోళన చెందినా తలనొప్పి వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మలబద్ధకం ఉన్నా, కంప్యూటర్లముందు ఆఫీసులో, పనిచేసే స్థలాలలో కదలకుండా ఒకేచోట కూర్చున్నా కండరాలు పట్టేసి తలనొప్పి వస్తుంది.

తలనొప్పులకు ప్రమాదం లేని పెయిన్ కిల్లర్స్ వాడండి

తలనొప్పులకు ప్రమాదం లేని పెయిన్ కిల్లర్స్ వాడండి

ఇవి సాధారణంగా వచ్చే తలనొప్పులకు ఉండే లక్షణాలు. ఇక ఈ తలనొప్పులను తగ్గించుకోవటానికి శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్తున్నారు. ఇక సాధ్యమైనంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం కూడా మంచిదని చెప్తున్నారు. కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యటం వల్ల కూడా కొన్ని సార్లు తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ మందులు వాడాలి అనుకుంటే ప్రమాదం కలిగించని పెయిన్ కిల్లర్స్ వాడాలని సలహా ఇస్తున్నారు.

మనుషుల్ని వేధిస్తున్న రకరకాల తలనొప్పులు

మనుషుల్ని వేధిస్తున్న రకరకాల తలనొప్పులు

ఇవి కాక మైగ్రేన్ తలనొప్పులు, టెన్షన్తో వచ్చే తలనొప్పులు, వాస్కులర్ తలనొప్పులు, క్లస్టర్ తలనొప్పులు రకరకాల తలనొప్పులు ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా క్రమబద్ధమైన జీవన సరళిని అలవాటు చేసుకోవడం, టెన్షన్ లేకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చేస్తే ఈ తలనొప్పుల బారి నుండి బయట పడే అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: వాటర్ కు డయాబెటిస్ కు లింక్.. అదేంటో తెలుసా!!health tips: వాటర్ కు డయాబెటిస్ కు లింక్.. అదేంటో తెలుసా!!

English summary
Are you suffering with Frequent headaches? try to reduce stress to reduce headaches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X