health tips: జుట్టు ఊడిపోతుందని దిగులు పడుతున్నారా? అయితే మీ కోసమే అద్భుతమైన చిట్కాలు!!

జుట్టు మనిషి ముఖానికి అందాన్ని ఇచ్చే ముఖ్యమైన అలంకారం. మనుషుల్లో జుట్టు రాలడం సమస్య వారిని ఆత్మన్యూనతా భావానికి గురి చేస్తుంది. చాలామంది జుట్టు తెగ ఊడిపోతుందని దిగులు పడుతూ ఉంటారు. జుట్టు సమస్యలకు సీజనల్‌గా వచ్చే మార్పులు కూడా ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఇక జుట్టు సమస్యలకు గల కొన్ని కారణాలను, అలాగే కొన్ని ఇంటి చిట్కాలను గురించి తెలుసుకుందాం.

 వయసుతో పాటు జుట్టు రాలిపోవటం సహజం

వయసుతో పాటు జుట్టు రాలిపోవటం సహజం


వెంట్రుకలు ప్రొటీన్‌తో తయారవుతాయని, హెయిర్ ఫోలికల్ సగటు జీవితకాలం 2 నుండి 7 సంవత్సరాలు ఉంటుందని మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు జుట్టు సహజంగా రాలిపోతుంది, కొత్త జుట్టు పెరగడానికి స్థలాన్ని వదిలివేస్తుంది. అయితే వయసు పెరిగే కొద్దీ జుట్టు ఒత్తుగా తగ్గి, రంగును కోల్పోయి, నెరిసిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మీ జుట్టు మందంలో మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు మందంగా ఉన్న జుట్టు కాస్త పలుచబడి ఒక సమస్యగా మారుతుంది.

మహిళల జుట్టు పలచబడటానికి రసాయన షాంపూలు కారణం

మహిళల జుట్టు పలచబడటానికి రసాయన షాంపూలు కారణం


అనేక హెయిర్ ఫోలికల్స్ కూడా కొత్త వెంట్రుకల ఉత్పత్తిని నిలిపివేస్తాయి, ఇది జుట్టు పల్చబడటానికి దారితీస్తుంది. ఇక మహిళల జుట్టు పల్చబడటానికి వారు ఉపయోగించే రసాయనాల షాంపూ లు కూడా కారణమని చెప్పవచ్చు. అంతేకాదు అనారోగ్యసమస్యలు, ఉపయోగించే మందులు తదితరాలు కూడా జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి.

 హెయిర్ మసాజ్ తో జుట్టు రాలటం తగ్గే అవకాశం

హెయిర్ మసాజ్ తో జుట్టు రాలటం తగ్గే అవకాశం


మీ స్కాల్ప్‌ను ఉత్తేజపరిచే స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల జుట్టు మందాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కణాలను ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా జుట్టు యొక్క మందం నెమ్మదిగా మరియు స్థిరంగా పెరుగుతుంది. కాస్త జుట్టు రాలిపోవడాన్ని నివారించి జుట్టు పెరగడానికి హెయిర్ మసాజ్ దోహదం చేస్తుంది. హెయిర్ మసాజ్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది

ఉసిరి, శీకాయ పొడి వాడితే మెరుగైన ఫలితాలు

ఉసిరి, శీకాయ పొడి వాడితే మెరుగైన ఫలితాలు


ఉసిరి ఆరోగ్యం మరియు అందం కోసం అనేక ప్రయోజనాలను చేకూర్చే పనులు ఉపయోగపడుతుంది. జుట్టు పల్చబడడాన్ని ఎదుర్కోవడానికి, మీ జుట్టును షాంపూ చేయడానికి ఉసిరిక పొడిని ఉపయోగించండి. జుట్టుకు ఆమ్లా ప్రయోజనాలను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మీరు ప్రత్యామ్నాయంగా దీనిని హెయిర్ టానిక్‌గా ఉపయోగించవచ్చు. శీకాయ అనేది బలమైన మరియు మందమైన జుట్టు కోసం ఉపయోగించే మరొక సహజమైన అద్భుత పదార్ధం. శీకాయ పొడి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు.

బ్రహ్మి, మెంతులతోనూ జుట్టు ఆరోగ్యం

బ్రహ్మి, మెంతులతోనూ జుట్టు ఆరోగ్యం


వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేయడానికి ఉపయోగించే మరో పురాతన ఔషధం బ్రహ్మి. జుట్టు పొడవును పెంచడానికి బ్రహ్మీ ఉన్న హెయిర్ ఆయిల్ ఉపయోగించండి. బ్రాహ్మీలోని ఆల్కలాయిడ్స్ జుట్టును బలంగా మరియు ఒత్తుగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.జుట్టు మంచిగా పెరగడానికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పబడింది. మెంతులు ప్రోటీన్ మరియు ఐరన్‌తో నిండి ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. జుట్టు పలచబడి కుండా కాపాడతాయి మెంతులు.

 చిట్కాలు ప్రయత్నం చేసినా జుట్టు రాలితే వైద్యుడిని సంప్రదించాలి

చిట్కాలు ప్రయత్నం చేసినా జుట్టు రాలితే వైద్యుడిని సంప్రదించాలి


ఇది మాత్రమే కాకుండా మందార ఆకులు, మందార పువ్వులు కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎక్కువగా జుట్టు ఊడిపోతున్న వారు క్రమం తప్పకుండా ఈ రెమెడీస్ ను ట్రై చేస్తే కొంతమేర జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అప్పటికీ సమస్య అదే విధంగా ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించబడింది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+