నవంబర్ 9 నుంచి కోటి దీపోత్సవం..!!
కార్తీక మాసాన్ని హిందువులందరూ అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. శివ కేశవులకు సైతం అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసం గురించి ఎంతో విశిష్టంగా చెబుతూ ఉంటారు. ఇక హైదరాబాద్‌లో కార్తీకమాసం అనగానే హిందువులందరికీ భక్తి టీవీ ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం జ్ఞప్తికి రాకుండా ఉండదు.
హైదరాబాదులో ప్రతి ఏడాది జరిగేటట్టుగానే ఈ ఏడాది కూడా నవంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.. 13 ఏళ్లుగా నిర్విరామంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న భక్తి టీవీ- ఎన్టీవీ యాజమాన్యం ఈ పదనాలుగో ఏడాది కూడా భక్త జనం ఒళ్ళు పులకరించేలా హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసింది.

ఈ ఏడాది 17 రోజులపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికల సిద్ధం చేశారు. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే ఈ కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను వెలికి తీసే పవిత్ర కార్యంగా ఈ కోటిదీపోత్సవంను ఎన్టీవీ భక్తి టీవీ సంయుక్తంగా నిర్వహిస్తూ వస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తరలి వస్తుండగా వారి ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఈ మహోత్సవాన్ని కనులారా వీక్షించడం ఒక గొప్ప అదృష్టం.
ప్రతిరోజు కళ్యాణ మహోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చూసి తరలించాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు లేవు. ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చే ఉత్సవ మూర్తులను చూసి భక్తకోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది.
కోటి దీపాల మహోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవనడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ 9 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వేడుకను నవంబర్ 25వ తేదీ వరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications