Mother's Day 2024: అమృతమయి అమ్మ కోరుకునే అద్భుతమైన బహుమతి ఇదే.. ఇస్తారు కదూ!!
అమ్మదనమున ఎంత కమ్మదనం ఉందిరా.. అమృతమ్ముకే ఆమె తీపి నేర్పింది రా.. అన్నారో మహాకవి. అటువంటి అమ్మ తాను కొవ్వొత్తిలా కరిగిపోతున్నా, పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రయత్నం చేస్తుంది. మానవ సంబంధాలు అన్నింటిలోనూ గొప్ప సంబంధం తల్లీబిడ్డల బంధం. అది పేగుతో ముడిపడిన అనుబంధం. సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమకు మచ్చుతునక అమ్మ. అలాంటి అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వన్ ఇండియా ప్రత్యేక కథనం.
పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేసేది ఒక్క అమ్మ మాత్రమే
అమ్మ పిల్లల కోసం ఎంతో చేస్తుంది. నవమాసాలు మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తన ముద్దుల పట్టి కోసం ఆ తల్లి జీవితాంతం చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. బిడ్డ పుట్టినప్పటినుంచి పెరిగి పెద్దవారై, వాళ్ల పిల్లలు పెద్దవాళ్లు అయినా కూడా తల్లికి ఆ బిడ్డ ఇంకా చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు. కన్నబిడ్డలకు చిన్న కష్టం వచ్చిందంటే విలవిలలాడి పోయేది అమ్మ మాత్రమే.

నిస్వార్థమైన అమ్మ ప్రేమ హిమాలయ శిఖరమంత సమున్నతం
పిల్లల విషయంలో ఆమెఅందరికీ స్వార్ధ పరురాలిగా కనిపిస్తుంది.. కానీ నిస్వార్థమైన ఆమె ప్రేమ హిమాలయ శిఖరం అంత సమున్నతం.. ప్రపంచవ్యాప్తంగా నేడు మదర్స్ డే జరుపుకుంటున్నారు. చాలామంది తమకు జన్మనిచ్చిన తల్లుల కోసం ఒక రోజున కేటాయించుకుని మరీ ఆమెని సంతోష పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మలకు బహుమతులు ఇచ్చి ఆశ్చర్య పరుస్తున్నారు. జన్మనిచ్చిన తల్లి పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నారు.
అమ్మలపై అడుగడుగునా నిర్లక్ష్యం
కానీ చాలామంది అమ్మలను ప్రస్తుత సమాజంలో చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారు. బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి, జీవితాన్ని ధారపోసిన తల్లులను పట్టించుకోని పుత్ర రత్నాలు ఎందరో ఉన్నారు. అయితే తల్లిని మర్చిపోయిన పిల్లలు, తల్లులను తన్ని తరిమేసినటువంటి పుత్ర రత్నాలు ఇంకా మన సమాజంలో ఉన్నారు. ఆస్తి కోసం తల్లిని హతమారుస్తున్న వారు కూడా లేకపోలేదు.
అమ్మపై నిర్లక్ష్యం చూపే పిల్లల ఆలోచనా విధానం మారాలి
వృద్ధాప్యం వచ్చిన తర్వాత తమకు భారంగా మారుతున్నారని వృద్ధాశ్రమాలలో వదిలి వెళుతున్న వారు కూడా మన సమాజంలో ఉన్నారు. ఈ పరిస్థితులు మారాలి.. అమ్మలేనిదే మన జీవం లేదు, మన జీవితమే లేదు అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎప్పుడూ బిడ్డలు సంతోషంగా ఉండాలని కాంక్షించే తల్లి కోరుకునేది రవ్వంత ప్రేమ.
అమ్మకు కావాల్సిన బహుమతి ఇదే .. ఇస్తారు కదూ
కాస్త ప్రేమ చూపిస్తే కొండంత సంబరపడిపోతారు తల్లులు. దేశవ్యాప్తంగా ప్రేమ కోసం పరితపిస్తున్న తల్లులకు మదర్స్ డే రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రేమగా మాట్లాడండి. వారి అవసరాలు తీరుస్తూ మేమున్నాం అన్న భరోసా ఇవ్వండి.. అమృతమయి అమ్మకు ఇంతకంటే మీరిచ్చే గొప్ప బహుమతి ఇంకేం లేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications