Relationship tips భార్య కంటే భర్త ఎందుకు పెద్దవాడై ఉండాలి? శాస్త్రం ఏం చెప్తుంది?
పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని చెప్తారు. అసలు భర్త భార్య కంటే ఎందుకు పెద్దవాడై ఉండాలి? శాస్త్రం ఏం చెప్తుంది?
పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని, ఒక మూడు నాలుగు సంవత్సరాల వయసు బేధం ఉండాలని పెద్దలు చెబుతారు. అసలు అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎందుకు ఎక్కువ ఉండాలి? భార్య కంటే భర్త ఎందుకు పెద్దవాడై ఉండాలి? అసలు ఎందుకు ఈ నియమం పెట్టారు? ఇద్దరూ సమాన వయస్సు, లేదా భర్త కంటే భార్య వయస్సు ఎక్కువ ఉంటే కలిగే నష్టం ఏమిటి? హిందూ ధర్మ శాస్త్రం వైవాహిక వ్యవస్థ గురించి ఏం చెప్తుంది? వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శరీర పరిపక్వత విషయంలో స్త్రీ, పురుషులిలా
వివాహంలో వయసు చాలా ముఖ్యమైనది. కాబట్టి వివాహం చేసేటప్పుడు పెద్దలు ముఖ్యంగా చూసేది భార్య కంటే భర్త పెద్దవాడై ఉండాలి. ఎందుకంటే శరీరం దృష్ట్యా, మానసిక పరిణతి దృష్ట్యా స్త్రీలు మగవాళ్ళ కంటే భిన్నంగా ఉంటారు. శరీర పరిపక్వత విషయంలో మగవాళ్ళ కంటే ముందే స్త్రీలు ఉంటారు. చిన్నతనం నుండి స్త్రీ శరీరం అందుకు తగ్గట్టుగా ఉంటుంది. అంటే ఒక పురుషుడి కంటే స్త్రీకి వృద్ధాప్యం నాలుగు సంవత్సరాలు ముందుగా వస్తుంది. మగవాళ్లకు ఆడవాళ్ళ కంటే వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుంది. కాబట్టి వివాహం చేసేటప్పుడు భార్య కంటే భర్త వయసు పెద్దదై ఉండాలని చెబుతారు.

భార్య వయస్సు భర్త కంటే ఎక్కువ ఉంటే జరిగేదిదే
అలా కాకుండా సమాన వయసు వారిని చేసుకున్నా, వయసు తక్కువ మగవాళ్ళను చేసుకున్నా ఆడవాళ్లు త్వరగా ముసలివారవుతారని చెబుతారు. భర్త కంటే ముందే వృద్ధురాలైన భార్య భర్తకు ఎటువంటి సేవలు చేయలేదు. ఇక తనకంటే పెద్దదైన భార్యకు వృద్ధాప్యంలో భర్త సేవలు చేయలేడు. భార్య పాత్ర పోషించే మహిళలు సహనశీలురు. కుటుంబం కోసం తమ జీవితాన్ని అహరహం త్యాగం చేస్తారు. కాబట్టి భార్య కంటే భర్త పెద్దవాడు అయితేనే ఆ కాపురం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని చెబుతారు.

మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో మానసిక పరిణతి ఇలా
ఇక అంతే కాదు మగవాళ్ళు మానసికంగా పరిణితి చెందక ముందే ఆడవారికి అమోఘమైన మానసిక పరిణతి ఉంటుంది. కాబట్టి తనకంటే నాలుగైదు సంవత్సరాలు పెద్దవాడైన పురుషుడిని పెళ్లి చేసుకున్నప్పటికీ స్త్రీకి అందుకు తగ్గ మానసిక పరిణతి ఉంటుంది. అదే మగవాళ్లకు స్త్రీలకు తగ్గట్టుగా మానసిక పరిణతి ఉండదు. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే వయసులో పెద్దవారు అయితేనే వారికి వివాహం చేస్తే వారి కాపురం సభ్యంగా ఉంటుందని భావిస్తారు.

వివాహ వయస్సులో వ్యత్యాసం ఇందుకే
మానసిక, శారీరక కారణాల వల్లనే ఆడ, మగ వివాహ వయసులో వ్యత్యాసం ఉందని నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య నాలుగైదు సంవత్సరాల వ్యత్యాసం ఉండడం వల్ల, భర్త భార్య కంటే ఒక నాలుగైదు సంవత్సరాలు పెద్దవాడు కావడం వల్ల కలిగే నష్టం లేదని, కానీ స్త్రీ భర్త కంటే వయసులో పెద్దదైతే వారి ఆలోచన సరళిలో మార్పు, త్వరగా వృద్ధాప్య ఛాయలు వంటివి కలుగుతాయని, దానివల్ల భార్యాభర్తల దాంపత్య జీవితానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. భార్య భర్తల బంధం పటిష్టంగా నిలవాలి అంటే, వారిద్దరూ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని సాగించాలి అంటే వారి మధ్య సరైన వయసు వ్యత్యాసం ఉండి తీరాల్సిందేనని చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications