వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ కు మించిన మొక్క ఇది- అది అపోహ మాత్రమే
ఇంట్లో శాంతి, ప్రశాంతత, ఐక్యత, ఆనందం, ఆరోగ్యం, సంపద నిరంతరం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరకుంటారు. ఇందుకోసం వాస్తు నియమాలకు అనుగుణంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం మంచిదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఈ మొక్కల్లో నాగ జెముడు (Snake Plant) అత్యంత ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో ఎక్కడ, ఎలా, ఏ దిశలో ఉంచాలి, దీని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాములు దరిచేరవు
స్నేక్ ప్లాంట్ (Sansevieria trifasciata) ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందినది. దీని పేరులో 'పాము' ఉండటంతో కొందరు ఆందోళన చెందుతుంటారు. ఈ మొక్కలు ఉన్నచోట పాములు దరిచేరవు. దీని ఆకులు కత్తి ఆకారంలో, పాములా మెలికలు తిరిగి ఉంటాయి కాబట్టి దీనిని స్నేక్ ప్లాంట్ అని పిలుస్తారు.

డస్ట్ అలర్జీ ఉన్నవారు..
ఈ మొక్క సంపదను, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్ముతారు. దీన్ని ఇంట్లో పెంచడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. స్నేక్ ప్లాంట్ గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజిన్, జిలీన్ వంటి విష పదార్థాలతో పాటు ఇతర కాలుష్య కారకాలను తొలగిస్తుంది. రాత్రివేళ కూడా ఆక్సిజన్‌ను విడుదల చేయడం దీని ప్రత్యేకత. డస్ట్ అలర్జీ ఉన్నవారు ఈ మొక్కను నిరభ్యంతరంగా ఇంట్లో పెట్టుకోవచ్చు.
ఇంటి లోపల, బయటా
వాస్తు శాస్త్రం ప్రకారం అదృష్టం కోసం స్నేక్ ప్లాంట్‌ను ఇంటి లోపల, బయట కూడా పెంచవచ్చు. సరైన ప్రదేశంలో ఉంచినట్లయితేనే అధిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా వంటగది, బాత్‌రూమ్, పడకగది వంటి ప్రదేశాలలో ఈ మొక్కను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. సానుకూల శక్తి కోసం వంటగదిలో స్నేక్ ప్లాంట్‌ను ఉంచడం చాలా మంచిదని చెబుతారు.
వంటగదిలో సులభంగా
ఈ మొక్క పెరగడానికి సూర్యకాంతి పెద్దగా అవసరం ఉండదు. దీనివల్ల వంటగదిలో సులభంగా పెంచవచ్చు. ఇది గొప్ప క్రిమిసంహారకారిగా కూడా పనిచేస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే.. ఇంటి శ్రేయస్సును కూడా వృద్ధి చేస్తుంది. వంటగదిలో తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఈ మొక్కను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు.
స్టవ్ పక్కన వేడికి లేదా పొగ తగిలేలా
ఎట్టి పరిస్థితుల్లోనూ స్టవ్ పక్కన వేడికి లేదా పొగ తగిలేలా ఉంచకూడదు. వంటగదిలో మొక్కలు పెంచినప్పుడు ఆకులు తేలికగా మురికి పేరుకుపోయే అవకాశం ఉంది. అందువల్ల మొక్క ఆకులపై ధూళి చేరనివ్వకుండా, శుభ్రంగా చూసుకోగలిగితేనే వంటగదిలో ఈ మొక్కను ఉంచాలి. లేకపోతే దీని ప్రయోజనాలు తగ్గుతాయి.
ఎల్లప్పుడూ నేలపైనే ఉంచాలి
ఇంటి హాలులోని ఒక మూలలో కూడా ఈ మొక్కను పెంచవచ్చు. అతిథుల కంటికి కనిపించేలా ఉంచినట్లయితే, దిష్టి పోయి, ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు. స్నేక్ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ నేలపైనే ఉంచాలి, టేబుల్‌పైన లేదా ఇతర ఉపరితలాలపై పెట్టకూడదు. ఈ మొక్క చుట్టూ ఇతర మొక్కలను ఉంచకూడదు, అలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుందని భావిస్తున్నారు.
కొంతవరకు విషపూరిత గుణాలు..
ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మొక్కల ఆకులలో కొంతవరకు విషపూరిత గుణాలు ఉంటాయి. ఆకులు నాలుకకు తగిలితే, నోరు మొద్దుబారిన అనుభూతి కలుగుతుంది. అందువల్ల, పిల్లలు, పెంపుడు జంతువులు ఈ మొక్కల దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఇది వాటికి హానికరం.












Click it and Unblock the Notifications