రైతులు యాసంగి పంట వేయొద్దు: మంత్రి పొంగులేటి కీలక విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌ నినో ప్రభావంతో కరువు ముప్పు పొంచి ఉందని రైతులు యాసంగి పంటను వేయోద్దని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో సాగునీరు సహా తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ఇక ఇప్పటికే రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ప్రస్తుత పరిస్థితుల్లో రెండో పంటను వేసి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణలోనూ తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఎల్ నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో సాగు నీటితో పాటు రాబోయే రోజుల్లో తాగు నీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే రాష్ట్రంలో రానున్న రోజుల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని.. పవర్‌ గ్రిడ్‌లో డిమాండ్‌ కు తగినట్లుగా విద్యుత్ సరఫరా చేయడం కష్టంగా మారుతోందన్నారు. విద్యుత్‌ ను బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలంటే ఒక్కో యూనిట్‌ కు రూ. 15 వెచ్చించినా దొరకని దయనీయ పరిస్థితి నెలకుందని వివరించారు. అందువల్ల ప్రజలందరూ కూడా విద్యుత్‌ ను అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచనలు చేశారు.

Ponguleti Srinivas Reddy Drought in Telangana makes a crucial appeal not to sow a second crop

ఇక రేపు, ఎల్లుండి కేబినెట్ సమావేశాలు జరుగుతాయని ఈ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, తాగు, సాగు నీటి ఎద్దడి, విద్యుత్ కొరతను సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కోవాలో చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి కరువు నివారణకు, రాష్ట్రానికి అండగా నిలవాలని ఈ సమావేశంలో తీర్మానించి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అంతేకాక రాష్ట్రానికి అధిక ఆర్థిక సహాయం అందించేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని.. జీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో అదనపు పనిదినాలు కల్పించాలని కేంద్రాన్ని కోరతామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+