రజినీకాంత్‌కు రికార్డు రెమ్యునరేషన్.. జైలర్ 2 కోసం అన్ని కోట్లా?

Rajinikanth Remuneration: సూపర్‌స్టార్ రజినీకాంత్‌ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'జైలర్ 2'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. 2023లో విడుదలైన బ్లాక్‌బస్టర్ 'జైలర్'కు సీక్వెల్‌గా రూపొందుతోంది. తొలి భాగం సాధించిన విజయానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారాగణం, యాక్షన్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమాకు రజినీకాంత్ తీసుకున్న పారితోషికంపై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ రజినీకాంత్‌ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు?

10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!
10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!

భారీ తారాగణంతో జైలర్ 2
రజినీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు, మిర్నా మీనన్, అన్నా రాజన్, జతిన్ సార్ణా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగంలో కనిపించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా సీక్వెల్‌లో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా అతిథి పాత్రలో కనిపించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ, ఆర్. నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

Rajinikanth Remuneration for Jailer 2

రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
సెన్సార్‌పై కూడా చర్చ
మరోవైపు 'జైలర్ 2' సెన్సార్ సర్టిఫికెట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో భిన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఏ సర్టిఫికెట్, యూ/ఏ సర్టిఫికెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కూడా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. రజినీకాంత్ కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమా విడుదల విషయంలో కొన్ని అంశాలపై పట్టుదలగా ఉన్నారనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'జైలర్ 2' అక్టోబర్ 15న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది.

ఏపీ పంచాయతీరాజ్ దేశంలోనే నెంబర్ 1.. పవన్ కళ్యాణ్ పాలనపై చిరంజీవి ప్రశంసలు
ఏపీ పంచాయతీరాజ్ దేశంలోనే నెంబర్ 1.. పవన్ కళ్యాణ్ పాలనపై చిరంజీవి ప్రశంసలు

రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎంత?
సినీ వర్గాల టాక్ ప్రకారం.. 'జైలర్ 2' కోసం రజినీకాంత్ సుమారు రూ.125 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సినిమా లాభాల్లో కూడా ఆయనకు వాటా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ మొత్తంపై నిర్మాతలు లేదా చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా మాత్రం రూ.125 కోట్లకు సంబంధించిన చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో అసలు తలైవా పారితోషికం ఎంత అన్నది అధికారికంగా వెల్లడయ్యే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు.

 మహేష్ బాబు - ప్రభాస్ కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
మహేష్ బాబు - ప్రభాస్ కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్‌బస్టర్

రూ.300 కోట్ల వరకు బడ్జెట్?
'జైలర్ 2' నిర్మాణం కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. నటీనటుల పారితోషికాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, నిర్మాణ వ్యయం కలిపి సినిమా బడ్జెట్ రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. రజినీకాంత్‌కు మాత్రమే రూ.125 కోట్ల వరకు చెల్లిస్తే.. మిగిలిన తారాగణం, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, యాక్షన్ సన్నివేశాలు, సెట్స్, షూటింగ్ ఖర్చులు, ప్రమోషన్ తదితర అంశాలు కలిపి మొత్తం బడ్జెట్ భారీగా మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 'జైలర్ 2' కోసం రజినీకాంత్ రూ.125 కోట్ల పారితోషికం తీసుకున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి లాభాల్లో వాటా కూడా కలిస్తే తలైవా ఫైనల్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+