రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణ'.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దీపావళి సందర్భంగా నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

ఈ మేరకు రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో నటించింది. ఇక ఈ మూవీలో రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ కనిపించనున్నారు. ఈ మేరకు దసరా పండగ నుంచి ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

ఈ రామాయణ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అలాగే యష్ కు చెందిన మాన్‌ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామాయణ తొలి పార్ట్ మొదటి 2026లో రానుండగా.. రామాయణ పార్ట్ 2 ను 2027 దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Ramayana movie release date out the makers have officially announced that it released on November 5

ఇక ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే రామాయణ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయనతోపాటు హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డీఎన్ ఈజీ అనే సంస్థ దీనికి విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి స్టార్ కాస్ట్ ఈ మూవీలో ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే దంగల్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నితీష్ తివారీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+