వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి- జాక్ పాట్ కొట్టినట్టే

వాస్తు శాస్త్రంలో వాస్తు పిరమిడ్‌ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంటి నెగటివిటీ, ఒత్తిడి, ప్రతికూల శక్తిని తొలగించడానికి శక్తివంతమైన పరిష్కారాన్ని చూపుతుందని విశ్వసిస్తారు. క్రిస్టల్, ఇత్తడి లేదా రాగి పిరమిడ్‌లు ఇంటికి సానుకూలత, సంపద, ప్రశాంతతను అందిస్తాయి. ఆధునిక జీవితంలో ఏ ఇంటికైనా సానుకూల శక్తి అత్యవసరం. దీన్ని వాస్తు పిరమిడ్ ప్రభావవంతంగా అందిస్తుందని, సమస్యలను పరిష్కారిస్తుందని నమ్ముతారు.

వాస్తు పిరమిడ్ ప్రతికూలతలను దూరం చేయడమే కాక, సుఖశాంతులు, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పాజిటివ్ ఎనర్జీని కేంద్రీకరించగల ఒక ప్రత్యేక జ్యామితాయ ఆకృతి కావడం వల్ల దీనికి ఈ ప్రాధాన్యత ఏర్పడింది. పిరమిడ్ అంటేనే శక్తికి కేంద్రం. ఇది సానుకూల శక్తిని ఆకర్షించి, ప్రతికూలతను గ్రహించి శుద్ధి చేస్తుంది.

Transform Your Space Vastu Pyramids in Home Correct Energy Imbalances and Channel Positive

ధన స్థానం లేదా వ్యాపార ప్రదేశంలో పిరమిడ్ ఉంచితే, ఆదాయ వనరులు పెరిగి, అనవసర ఖర్చులు తగ్గుతాయి. పిల్లల స్టడీ టేబుల్‌పై చిన్న పిరమిడ్ ఉంచడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. వాస్తు దోషాల నివారణతో కుటుంబంలో మానసిక ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఇది ఇంట్లో కలహాలను తగ్గించి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుతుంది. క్రమం తప్పకుండా వాస్తు పిరమిడ్‌ను వాడటం ద్వారా ఇంట్లో నిరంతర సుఖశాంతులు, శ్రేయస్సు ఉంటాయి.

వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రాముఖ్యత ఉంది. ఇంటి శ్రేయస్సు కొరకు పిరమిడ్‌ను ఈశాన్య కోణం (నార్త్-ఈస్ట్)లో ఉంచడం అత్యంత శుభప్రదం, సానుకూల శక్తిని పెంచుతుంది. ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే, తలుపు పైన లేదా చుట్టూ పిరమిడ్ బయటి ప్రతికూల శక్తిని ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. నైరుతి దిశలో పిరమిడ్ కార్యరంగంలో స్థిరత్వం, పదోన్నతులు అందిస్తుంది. దక్షిణ దిశలో ఇత్తడి లేదా రాగి పిరమిడ్‌ను ఉంచితే ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. సరైన దిశను అనుసరించి మాత్రమే పిరమిడ్‌ను స్థాపించాలి.

పిరమిడ్‌ను ఎంచుకునేటప్పుడు క్రిస్టల్ పిరమిడ్ ఉత్తమమైనది, ఇది శక్తిని శుద్ధి చేస్తుంది. ఇత్తడి లేదా రాగి పిరమిడ్‌లు కూడా ప్రభావవంతం. చిన్న పరిమాణ పిరమిడ్ ఎక్కువ ప్రయోజనకరం. శుక్రవారం లేదా ఆదివారం నాడు ఇంట్లో స్థాపించడం శుభప్రదం. పిరమిడ్‌ను శుభ్రమైన, పవిత్రమైన ప్రదేశంలో ఉంచి, క్రమం తప్పకుండా ధూపదీపాలను నివేదించాలి. నకిలీ పిరమిడ్‌ల వల్ల ప్రయోజనం ఉండదు. అసలైన, నాణ్యమైన పిరమిడ్ మాత్రమే వాస్తు ప్రయోజనాలను అందిస్తుంది.

వాస్తు పిరమిడ్‌ను దోషాలున్న స్థలంలో ఉంచవచ్చు. ముందుగా శుభ్రపరిచి, గంగాజలంతో కడిగి, మీ సంకల్పంతో స్థాపించాలి. రోజువారీ ఉదయం, సాయంత్రం దాని నుండి శక్తి ప్రసారం అవుతుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల ఇంటి వాతావరణం శుద్ధిగా, సానుకూలంగా మారుతుంది. వాస్తు పిరమిడ్ ఇంటిలో సానుకూల మార్పులకు సరళమైన, సమర్థవంతమైన మార్గం. పెద్దగా ఖర్చు లేకుండా మీ ఇంటిని సుఖశాంతులకు కేంద్రంగా మార్చుకోవచ్చు.

వాస్తు పిరమిడ్‌ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంటి సభ్యులు ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతారో ఆ ప్రదేశంలో వాస్తు పిరమిడ్ ఉంచాలని శాస్త్రం చెబుతోంది. ఈశాన్య మూలలో ఉంచడం శ్రేయస్కరం. ఈశాన్యం శక్తికి కేంద్రంగా భావిస్తారు. అందుకే ఈశాన్య మూలలో వాస్తు పిరమిడ్ ఉంచితే ఇంటిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పూజా గదిలో ఈశాన్య మూలలో ఉంచినా మంచి ప్రయోజనం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+