చిట్టచివరి, శక్తిమంతమైన ముక్కోటి ఏకాదశి- చేయాల్సిన పనులు ఇవే
ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి/పుత్రద ఏకాదశి గా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని అశేష భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వైష్ణవాలయాలను సందర్శిస్తారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తారు.
దృక్ పంచాంగం ప్రకారం.. ఏకాదశి తిథి ఈ నెల 30వ తేదీన ఉదయం 7: 50 నిమిషాలకు ప్రారంభమౌతుంది. 31వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథిని అనుసరించి భక్తులు 30వ తేదీనాడే వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రత పారణ సమయం 31న మధ్యాహ్నం 1: 26 నుండి 3: 31 నిమిషాల వరకు ఉంటుంది.

ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువును శాస్త్రోక్తంగా పూజించాలి. పూజలో పసుపు రంగు వస్త్రాలు, పుష్పాలు, చందనం, కుంకుమ, అగరుబత్తీలు, దీపం, పండ్లు, స్వీట్లు సమర్పించాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు. ఇది ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు, సానుకూల శక్తిని నింపుతుందని ప్రతీతి.
వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కను నాటడం లేదా పూజించడం శుభప్రదంగా భావిస్తారు. తులసి అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి పూజలో తులసి దళాలను తప్పనిసరిగా వాడాలి. ఈ పవిత్రమైన రోజున తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఏకాదశి నాడు తులసి మాత నిర్జల వ్రతాన్ని ఆచరిస్తుందని విశ్వాసం.
వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీ చాలీసా పారాయణం చేయడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఈ దినం శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రతీకరమైనది. వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేకంగా వైకుంఠ/స్వర్గ/ఉత్తర ద్వారా దర్శనాలు కల్పిస్తారు. ఇలా దర్శించుకోవడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పునర్జన్మ కూడా ఉండదని భక్తులు విశ్వసిస్తారు.
ఈ శుభదినాన పేదలకు, బ్రాహ్మణులకు, కన్యలకు భోజనం పెట్టించడం చాలా మంచిది. పసుపు వస్త్రాలు, శనగపప్పు, పసుపు, కుంకుమపువ్వు, పండ్లు, మిఠాయిలు, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ఇంట్లో సుఖసమృద్ధులు వెల్లివిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications