వాస్తు దోషాల నివారణకు దక్షిణ దిశ ముఖం ద్వారం ఉన్న వాళ్లు ఇలా చేయండి

వాస్తు శాస్త్రం ఇంట్లోని ప్రతి దిశకు ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇంటి నిర్మాణం సరైన దిశలో ఉండటమే కాకుండా, ఇంట్లో ఉంచిన వస్తువుల స్థానం కూడా సరిగ్గా ఉంటే, ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా, ఇంటి ప్రధాన ద్వారం, కిటికీలు, బాల్కనీల దిశలు నివాసితుల సుఖసంతోషాలపై, ఆర్థిక ప్రగతిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వీటిని వాస్తు సూచనల ప్రకారమే ఏర్పాటు చేయాలని నిపుణులు తరచుగా సలహా ఇస్తారు.

వాస్తు నిపుణుల ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ దిశలో ఉండటం మంచిది కాదు. ప్రధాన ద్వారం ఇంటి శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. దీని ద్వారానే సానుకూల శక్తులు ఇంటిలోకి ప్రవేశిస్తాయి. దక్షిణ దిశ యముని దిశగా భావిస్తారు. ఈ దిశలో ద్వారం ఉండటం వల్ల ఇంటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది కుటుంబంలో ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం.

Vastu for Main Door Directions and Window Placements to Boost Positive Energy at Home

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం ఈశాన్య దిశలో ఉండటం అత్యంత శుభదాయకం. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే, ఆగ్నేయ దిశలో కూడా ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రధాన ద్వారం ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి దిశలో ఉండకూడదు. సరైన దిశలో ఉన్న ప్రధాన ద్వారం కుటుంబ సభ్యుల జీవితాలపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, ఇంట్లో సుఖసంతోషాలు, సంపద నిలుస్తాయనేది వాస్తు చెబుతోంది.

ముఖ్య ద్వారం దక్షిణ దిశలో ఉన్న ఇళ్లకు కొన్ని వాస్తు పరిష్కారాలున్నాయి. వాటిలో ఒకటి- ప్రవేశ ద్వారం వద్ద విఘ్నేశ్వరుని చిత్రాన్ని ఉంచడం. గణేశుడు విఘ్నహర్త కావడం వల్ల అన్ని అడ్డంకులను తొలగించి, ఇంటిలో సుఖశాంతులను నెలకొల్పుతాడని ప్రగాఢ నమ్మకం. అందువల్ల, దక్షిణ ముఖ ద్వారం ఉన్నవారు తప్పకుండా గణేశుని చిత్రాన్ని అమర్చాలి.

దక్షిణ దిశలో ప్రధాన ద్వారం ఉన్నప్పుడు, ద్వారం ఇరువైపులా గోడలపై స్వస్తిక్ గుర్తును వేయడం శుభప్రదంగా భావిస్తారు. కావాలంటే, ప్రధాన ద్వారంపై వెండి స్వస్తిక్‌ను కూడా అమర్చవచ్చు. స్వస్తిక్ సానుకూల శక్తి, శుభాలను ఆకర్షించే ప్రతీకగా వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది. ఇది ఇంటికి రక్షణను అందిస్తుంది.

ప్రధాన ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయుని చిత్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ చిత్రపటం ఇంట్లో ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని, ఆంజనేయ స్వామి కుటుంబ సభ్యులను రక్షిస్తాడని బలంగా నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. ప్రధాన ద్వారం ఇంట్లోని ఇతర తలుపుల కంటే పెద్దదిగా ఉండాలి. ఇది సానుకూల శక్తులకు సులభమైన ప్రవేశాన్ని అందిస్తూ, ఇంట్లో నిరంతరం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.

మీ ఇల్లు దక్షిణ ముఖంగా ఉంటే, ప్రధాన ద్వారం వద్ద కాక్టస్ మొక్కను ఉంచడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని ప్రవేశించకుండా రక్షించడంలో సహాయపడుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దక్షిణ దిశ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న గోడపై ఒక పెద్ద అద్దాన్ని అమర్చడం. దీనివల్ల ద్వారం తెరవగానే ప్రవేశించే ప్రతికూల శక్తి అద్దంలో ప్రతిబింబించి, తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందని నమ్మకం. ఇది ఇంటిలోకి చెడు ప్రభావాలు ప్రవేశించకుండా కాపాడుతుంది.

వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద తప్పకుండా నేమ్ ప్లేట్‌ను అమర్చాలి. ఇది ఇంట్లో మంచి ఆరోగ్యం, సంపద, సంతోషం, శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని ప్రగాఢ నమ్మకం. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా విద్యుత్ స్తంభం లేదా పెద్ద చెట్టు ఉండటం వాస్తు ప్రకారం అశుభం. ఈ వస్తువుల నీడ ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: వాస్తుశాస్త్రంలో దక్షిణదిశ ప్రధాన ద్వారం గురించి తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. మరింత వివరణాత్మక, ఖచ్చితమైన సమాచారం కోసం వాస్తు నిపుణులను సంప్రదించి సలహా తీసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+