వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్ పై ఈ వస్తువులు ఉంచితే కొంప కొల్లేరే
ప్రతి ఇంటికి ఫ్రిడ్జ్ ఓ బేసిక్ నీడ్. కూరగాయలు, ఆకుకూరలు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం మొదలుకుని పలు రకాలుగా ఫ్రిడ్జ్ ను వినియోగించడం పరిపాటి. ఇది లేని ఇళ్లు దాదాపుగా ఉండకపోవచ్చు. చాలామంది తమ సౌకర్యం కోసం ఫ్రిడ్జ్ పై పలురకాల వస్తువులను ఉంచుతారు. వాస్తు నిపుణుల ప్రకారం ఈ అలవాటు ఇంట్లో ప్రతికూల ప్రభావాలు సృష్టిస్తాయి. రిఫ్రేజిరేటర్ పైన ఉంచే కొన్ని రకాల వస్తువులు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.
ఫ్రిడ్జ్ పైన ఏవి ఉంచకూడదో, వాటి వాస్తు కారణాలు తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ పైన ఔషధాలు పెట్టడం ఆరోగ్యానికి హానికరం. చాలా ఇళ్లలో మందుల పెట్టెను సులువుగా దొరికేలా, కనిపించేలా ఫ్రిడ్జ్ పైన ఉంచుతుంటారు. వాస్తు ప్రకారం- ఇది ఆనారోగ్యకర వాతావరణానికి, సమస్యలకు దారి తీస్తుంది. ఫ్రిజ్ చల్లదనం, ఓ శక్తికి ప్రతీక. మందులు వ్యాధితో ముడిపడి ఉంటాయి. ఈ రెండింటి కలయిక ఇంట్లో ప్రతికూల ప్రకంపనలు సృష్టించి, తరచుగా అనారోగ్యాలు రావడానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందులను ఎల్లప్పుడూ శుభ్రమైన, మూసి ఉన్న బీరువాలో లేదా డ్రాలో భద్రపరచాలి.

ఎలక్ట్రానిక్ వస్తువులను ఫ్రిజ్ పైన ఉంచకూడదు. ఛార్జర్లు, ఎక్స్‌టెన్షన్ బోర్డులు, అడాప్టర్లు చాలామంది ఫ్రిడ్జ్ పైన పెడుతుంటారు. ఫ్రిడ్జ్ స్వయంగా ఓ శక్తిమంతమైన ఎలక్ట్రానిక్ ఉపకరణం. విద్యుదయస్కాంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దాని పైన మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టడం ఇంట్లో శక్తి అసమతుల్యతను సృష్టిస్తుంది. ఇది వాస్తురీత్యా అగ్ని తత్వాన్ని పెంచుతుంది. చిరాకు, ఒత్తిళ్లు, కుటుంబ విభేదాలు, ఆర్థిక, మానసిక సమస్యలకూ దారితీస్తుంది.
పూజా సామాగ్రిని ఫ్రిజ్ పైన ఉంచరాదు. స్థలం కొరత వల్ల పూజ పుస్తకాలు, మాలలు, అగర్‌బత్తీలు లేదా దీపపు పళ్లాన్ని ఫ్రిజ్ పైన ఉంచుతుంటారు. జ్యోతిష్యం ప్రకారం పూజా వస్తువులను పవిత్రమైన ప్రదేశంలోనే భద్రపరచాలి. ఫ్రిడ్జ్ వంటి భారీ ఎలక్ట్రానిక్ యంత్రం పైన వీటిని ఉంచడం వల్ల పూజ సానుకూల ప్రభావం తగ్గుతుంది. పాజిటివ్ ఎనర్జీకి ఆటంకం కలిగిస్తుంది. మతపరమైన వస్తువుల కోసం ప్రత్యేక మందిరం లేదా శుభ్రమైన అర ఉండాలి.
వాస్తు ప్రకారం.. ఫ్రిడ్జ్ పైభాగాన్ని ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచాలి. ఫ్రిడ్జ్ ను ఆహారానికి ప్రతీకగా భావిస్తారు. దాని పైన అనవసరమైన సామాగ్రిని ఉంచడం వల్ల గందరగోళం, నెగెటివ్ ఎనర్జీని సూచిస్తుంది. దీని పైభాగాన్ని శుభ్రంగా, ఖాళీగా ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థిరత్వం, మంచి ఆరోగ్యం, సానుకూల వాతావరణం నెలకొంటుంది.
-
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ??












Click it and Unblock the Notifications