ఇంట్లో దేవుళ్ల చిత్రపటాలు ఉంచడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంట్లో దేవుడి మందిరం ఏర్పాటు ఓ ఆచారం మాత్రమే కాదు.. అది సానుకూల వాతావరణాన్ని, ఆధ్యాత్మిక శక్తిని నింపే ప్రశాంత స్థలం. వాస్తు ప్రకారం, హిందూ దేవతా విగ్రహాలను సరైన పద్ధతిలో ఉంచడం కూడా కీలకమే. కొన్ని దేవుళ్ల విగ్రహాలు, చిత్రపటాలు కలిపి ఉంచకూడదు కూడా. అలా విగ్రహాలను కలిపి అమర్చడం మంచిది కాదు.

ప్రతి దేవతకు ప్రత్యేక శక్తి ఉంటుంది. శివుడు ప్రశాంతత, ధ్యానాన్ని సూచిస్తే, దుర్గా, కాళి వంటి శక్తి స్వరూపాలు దీనికి వ్యతిరేకం. గణేశుడు- జ్ఞానం, లక్ష్మీదేవి- సంపద, సరస్వతి- విద్యను ప్రసాదిస్తాయి. విభిన్న శక్తులు ఉన్న విగ్రహాలను కలిపి ఉంచినప్పుడు దాని స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.

నందితో కలిసి ఉన్న శివలింగం, శివుడి విగ్రహం, చిత్రపటాన్ని మాత్రమే పూజాగదిలో ఉంచాలి. అర్ధనారీశ్వర రూపం మినహా.. దుర్గా, కాళి వంటి శక్తి స్వరూపాలను శివుడి చిత్రపటానికి దగ్గరగా ఉంచకూడదు. దూరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల శివుని ప్రశాంత శక్తి, శక్తి రూపిణి అయిన కాళిక డైనమిక్ ప్రభావాన్ని వేర్వేరుగా సమతౌల్యం చేస్తుంది.

అలాగే- హనుమంతుడు, శని మహాత్ముడి విగ్రహాలను కలిపి ఉంచవద్దని వాస్తు నిపుణులు చెబుతారు. శని ప్రభావాలను హనుమంతుడు తగ్గిస్తాడని భావించినా.. రెండింటినీ పక్కపక్కన ఉంచడం వల్ల మంచిది కాదు. వాస్తు ప్రకారం- ఇది పాజిటివ్ ఎనర్జీని తగ్గించడానికి కారణమౌతుంది. ఈ రెండు దేవుళ్ల చిత్రపటాలను వేర్వేరు స్థానాల్లో ఉంచి, విడిగా పూజలు చేయడం మంచిది.

కాళిక లేదా దుర్గా వంటి ఉగ్ర దేవతా రూపాలను లక్ష్మి, సరస్వతి, కృష్ణుడు, గణేశుడు వంటి ప్రశాంత రూప దేవతల విగ్రహాల పక్కన ఉంచకూడదు. తీవ్రమైన శక్తి ప్రకంపనలను శాంతమైన శక్తులతో కలపడం పూజగదిలో అసమతుల్యతను సృష్టించినట్టవుతుంది.

ఒకే దేవుడికి చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ విగ్రహాలు (గణేశ విగ్రహాలు లేదా శివలింగాలు) ఒకే చోట ఉండకూడదు. అదనపు విగ్రహాలు ఉంటే, ఒకటి మందిరంలో ఉంచి, మిగిలిన వాటిని వేరే పూజాస్థలంలో భద్రపరచాలి.

విగ్రహాలు ఎదురెదురుగా ఉండకూడదు, ఇది పూజలో ఏకాగ్రతను ప్రభావితం చేస్తుంది. విరిగిన లేదా పాడైనవి కాకుండా, శుభ్రమైన, చెక్కుచెదరని విగ్రహాలను ఉపయోగించాలి. పూర్వీకుల చిత్రాలను దేవతా విగ్రహాలతో పాటు ఉంచవద్దు. వాటికి విడివిడి స్థలాలు అవసరం. పూజా స్థలాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పా టు చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+