Right To Property:వీలునామా రాయకుండా వ్యక్తి మరణిస్తే.. ఆస్తి ఎవరికి చెందుతుంది..?

Right To Property:సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో పిల్లలకు హక్కు ఉంటుంది. కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరికి సమానంగా ఆస్తి పంచుతూ వీలు రాస్తారు.ఇలా ఎందుకు చేస్తారంటే తమ తదనంతరం పిల్లల మధ్య ఆస్తితగాదాలు రాకూడదని ఇలా చేస్తారు.అయితే పిల్లలు సంపాదించిన ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా లేదా, కొడుకు భార్యకే మొత్తం ఆస్తి చెల్లుతుందా..?

చట్ట ప్రకారం కొడుకు సంపాదించే ఆస్తిపాస్తులపై తల్లిదండ్రులకు కూడా హక్కు ఉంటుంది.అయితే అది ఎలాంటి పరిస్థితుల్లో వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక వ్యక్తి (పురుషుడు) ఆస్తిపై అతని భార్య,పిల్లలు, తల్లికి హక్కు కలిగి ఉంటుంది. వీరందరినీ క్లాస్ -1 కింద విభజించారు. అంటే ఆ వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే అతని ఆస్తికి వీరంతా హక్కుదారులు అవుతారు.

ఒకవేళ మరణించిన వ్యక్తి ఆస్తికి ఎవరూ హక్కుదారులు లేకుంటే... అంటే క్లాస్‌-1లో పేర్కొన్న వారు లేకుంటే అది క్లాస్-2 వర్గంలో ఉండేవారు హక్కుగా పొందుతారు.క్లాస్ -2లో వ్యక్తి యొక్క నాణమ్మ, తల్లి, సోదరుడు/సోదరి, అమ్మమ్మ,తాతయ్య,,సోదరుడు/సోదరి యొక్క పిల్లలు, పెద్దనాన్న/బాబాయ్/మేనత్త, పెద్దనాన్న లేదా బాబాయ్ పిల్లలు, మేనకోడలు లేదా మేనల్లుడు,మేనమామ లేదా పిన్ని, తల్లి యొక్క సోదరుడు లేదా సోదరి పిల్లలు ఉంటారు.

law

కొడుకు ఆస్తిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కు ఉంటుంది..?

ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే అతని ఆస్తిని తల్లి, భార్యా పిల్లలు సమానంగా పొందుతారు.ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకారం ఒక వ్యక్తి అకాల మరణం చెందితే అతని తల్లిదండ్రులకు అతని ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదు.అయితే ఎలాంటి వీలునామా లేకుంటే మరణించిన వ్యక్తి తల్లిదండ్రులు ఆస్తి పొందేందుకు హక్కు కలిగి ఉంటారు.

హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 పిల్లలు సంపాదించిన ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కు కలిగి ఉంటుందా లేదా అనేది స్పష్టంగా నిర్వచించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ముందుగా కొడుకు ఆస్తిపై తల్లికే హక్కు ఉంటుంది.తల్లి తర్వాతే తండ్రికి హక్కు ఉంటుంది. కొడుకు అకాల మరణం పొందితే అతని ఆస్తిపాస్తులపై హక్కులో భాగంగా తొలి ప్రాధాన్యత తల్లికే ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉంది.

హిందూ వారసత్వ చట్టంలో జెండర్ కీలక పాత్ర పోషిస్తుంది. చనిపోయిన వ్యక్తి అవివాహితుడై ఉండి ఆస్తిపాస్తులు ఉంటే ముందుగా ఆ ఆస్తిని అతని తల్లికి బదిలీ అవుతుంది.తల్లి కూడా లేకుంటే తండ్రికి బదిలీ అవుతుంది. ఆ పరిస్థితి కూడా లేకుంటే అతని సహవారసులకు చెందుతుంది. అదే పెళ్లయిన వ్యక్తి వీలునామా రాయకుండా అకాల మరణం పొందితే హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి ఆ వ్యక్తి భార్యకు చెందుతుంది.

అలాంటి సందర్భంలో భార్య క్లాస్-1 కేటగిరీలోకి వస్తుంది. ఆమెతో పాటు కుటుంబంలోని సభ్యుల మధ్య ఆస్తి సమానంగా పంచడం జరుగుతుంది.అదే పెళ్లయిన మహిళ అకాల మరణం పొందితే ఆమె సంపాదించిన ఆస్తి చట్టప్రకారం ముందుగా ఆమె పిల్లలకు భర్తకు బదిలీ అవుతుంది. అలా లేని పక్షంలో ఆమె భర్త తరపున వారికి వెళుతుంది. అదికూడా కాని పక్షంలో ఆ మహిళ యొక్క తల్లిదండ్రులకు ఆస్తి ఇవ్వడం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+