చంద్రుడు ఒకవైపే ఎందుకు కనిపిస్తాడో తెలుసా..?
చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. సాయంత్రం గం.6.05 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడుపై అడుగు పెట్టింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ జరిగిన మూడు గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్‌లోని ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది.
14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంలో విక్రమ్ ల్యాండర్ వివిధ రకాల కీలక పరిశోధనలు చేయనుంది. ఇదిలా ఉంటే అసలు చంద్రుడు ఎందుకు మనకు ఒకవైపే కనిపిస్తాడనే అనుమానం చాలామందిలో నెలకొంది. భూమికి మాదిరిగానే చంద్రుడు కూడా ఓ గ్రహమే కదా. మరి చంద్రుడు ఎందుకు మనకు ఒకవైపే ఎందుకు కనిపిస్తాడని ప్రశ్నిస్తున్నారు. చంద్రుడు ఒకవైపే కనిపించడానికి చాలానే కారణాలు ఉన్నాయి.

వాటిల్లో కొన్నింటిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చంద్రుడు భూమి చూట్టు తిరుగుతాడని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్న మాట. మరి తన చూట్టు తాను తిరుగుతుంటే చంద్రుడు మనకు అన్ని వైపులా కనిపించాలి కదా అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. అయితే భూమి తన చూట్టు తానే తిరుగుతుంది. కాని చంద్రుడు అలా కాదు.. భూమి చూట్టు తిరుగుతునే చంద్రుడు తన చూట్టు తాను తిరుగుతుంది.

భూమి తన చూట్టు తాను తిరగడానికి 24 గంటల సమయం పడితే..చంద్రుడు తన చూట్టు తాను తిరడానికి ఇరవై తొమ్మిదిన్నర రోజులు పడుతుంది. అంటే చంద్రుడు మీద ఒకరోజు అంటే ,భూమి మీద ఇరవై తొమ్మిదిన్నర రోజులతో సమానం. ఇక్కడ మరోక విషయం ఏమిటంటే.. చంద్ర భ్రమణ కాలం, చంద్ర పరిభ్రమణ కాలం రెండు కూడా ఒకటే. కాబట్టి మనకు చంద్రుడు ఒకవైపు కనిపిస్తాడు. చంద్రుడు భూమికి ఒక ఉపగ్రహం కాబట్టి, భూమి చూట్టు పరిభ్రమిస్తున్నాడు. అందుకే చంద్రుడు మనకు ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు.












Click it and Unblock the Notifications