చంద్రబాబు సభలో తొక్కిసలాట: ముగ్గురు మృతి: పలువురికి గాయాలు

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో గందరగోళం చోటు చేసుకుంది. గుంటూరులో ఆయన నిర్వహించిన రోడ్ షో, బహిరంగసభ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

 గుంటూరులో..

గుంటూరులో..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. ఆందోళనను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. మొన్నీమధ్యే ఆయన నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. ఆ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిదిమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు.

ఆ ఘటన విస్మరించకముందే..

ఆ దుర్ఘటన గురించి ఇంకా విస్మరించకముందే - ఇప్పుడు తాజాగా గుంటూరులో కూడా అదే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంటూరు వికాస్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభలో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పేదలకు చంద్రన్న కానుకలను అందించే సమయంలో ఈ ఘటన సంభవించింది. ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం దీన్ని నిర్వహించింది.

 చంద్రన్న కానుకల కోసం..

చంద్రన్న కానుకల కోసం..


చంద్రన్న కానుకల కోసం సభలో నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు ముందుకు దూసుకు వచ్చారు. కానుకల కోసం ఎగబడ్డారు. దీనితో తొక్కిలసాట సంభివించింది. పలువురు గాయపడ్డారు. కాళ్ల కింద నలిగిపోయారు. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

సంక్రాంతి కానుకల పేరుతో..

సంక్రాంతి కానుకల పేరుతో..


గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్రాంతి పండగ సమయంలో చంద్రన్న కానుక పేరుతో ఓ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. దాన్నే ఇప్పుడు అనధికారికంగా ఏర్పాటు చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుకగా దుస్తులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది మరణించిన ఉదంతం ఇంకా స్మృతిపథం నుంచి తొలగిపోకముందే మళ్లీ అలాంటి ఘటన పునరావృతం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+