జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం.. ఐసీయూ వార్డులో చెలరేగిన మంటలు...

గుంటూరు నగరంలో గల జీజీహెచ్ లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రిలో రోగులు తక్కువగా ఉన్నారని.. ప్రమాదం జరిగిన గది వినియోగంలో లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 fire accident at guntur government hospital

షార్ట్ సర్క్యూట్ వల్ల మొదటి అంతస్తులో గల జనరల్ మెడిసిన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ పైపులు లీకవడంతో జనరల్ వార్డులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో జనరల్ వార్డులో వందలాది గా ఉన్న రోగులను సిబ్బంది అక్కడినుంచి తరలిస్తున్నారు. ఇందులో పలువురు మహిళలు కూడా ఉన్నారు.

మంటలు ఎగిసిపడుతుండటంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. రోగులను ఇతర వార్డులకు తరలిస్తున్నారు. రోగులతో పాటు వారి బంధువులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కృషి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+