గుంటూరు బీటెక్ విద్యార్థిని రేప్ కేసు... ఇద్దరు యువతుల ప్రమేయం... ఆ వీడియోను వాళ్లే...

గుంటూరు బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. యువతిపై అత్యాచారానికి పాల్పడి... ఆ వీడియోలను పోర్న్ సైట్లలో పెట్టిన ఈ కేసులో ఇద్దరు యువతుల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరిలో ఒకరు ఏ1 వరుణ్ స్నేహితురాలు కాగా మరొకరు ఏ2 కౌశిక్ సోదరిగా గుర్తించారు. ఈ ఇద్దరు యువతులను రూమ్ మేట్స్‌గా గుర్తించారు. యువతికి సంబంధించిన వీడియో వీరి వద్ద నుంచే కౌశిక్ చేరి... అక్కడినుంచి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అయినట్టుగా గుర్తించారు.

ఆ యువతులే...

ఆ యువతులే...

వరుణ్ నుంచి అతని స్నేహితురాలు ఆ యువతికి సంబంధించిన వీడియోని సేకరించి కౌశిక్ సోదరికి ఇచ్చినట్టు దిశ పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె దాన్ని కౌశిక్‌కి ఇవ్వడంతో.. అప్పటికే ఆమెపై ఆగ్రహంతో ఉన్న అతను దాన్ని ఇంటర్నెట్‌లో పెట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఫోన్ కాల్ డేటా,కాల్ రికార్డింగ్స్ ఆధారంగా ఆ ఇద్దరు యువతులను పట్టుకునే పనిలో ఉన్నారు.

ఆమెపై వరుణ్ అత్యాచారం...

ఆమెపై వరుణ్ అత్యాచారం...

మూడేళ్ల క్రితం ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బాధితురాలు ఇంజనీరింగ్ చదువుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో వరుణ్ అనే యువకుడు స్నేహం పేరుతో ఆమెను నమ్మించాడు. ఓరోజు తన ఫ్లాట్‌కి తీసుకెళ్లి కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ దృశ్యాలను వీడియో కూడా తీశాడు. అప్పటినుంచి బాధితురాలు వరుణ్‌ని దూరం పెట్టింది.

కౌశిక్‌తో పరిచయం... ప్రేమ,పెళ్లి దాకా...

కౌశిక్‌తో పరిచయం... ప్రేమ,పెళ్లి దాకా...

ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమెకు కౌశిక్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంట్లో వాళ్లకు కూడా చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు కాలేజీకి వెళ్లి ఆమె గురించి ఆరా తీశారు. అదే సమయంలో వరుణ్‌ గురించి వారికి తెలిసింది. ఆ యువతి క్యారెక్టర్ సరైంది కాదని చెప్పడానికి... వరుణ్ వద్ద ఉన్న వీడియోలను సేకరించి కౌశిక్‌కి చూపించారు. అలా ఆమెతో పెళ్లి ప్రపోజల్‌ను కౌశిక్ వదులుకునేలా చేశారు.ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు యువతులే కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. వరుణ్ నుంచి వీడియోలు సేకరించి... కౌశిక్‌కి చేరవేసింది వారేనని పోలీసులు తాజాగా గుర్తించారు.

చీటింగ్ 420 పేరుతో వేధింపులు...

చీటింగ్ 420 పేరుతో వేధింపులు...

తాను ప్రేమించిన యవతి తనకు దక్కలేదన్న ఆగ్రహంతో కౌశిక్ ఆమె వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టాడు. అయితే కొద్దిరోజులకు ఆ వీడియోలను గుర్తించిన బాధితురాలు కుటుంబ సభ్యుల సాయంతో వరుణ్,కౌశిక్ కుటుంబాలతో మాట్లాడి వాటిని ఇంటర్నెట్ నుంచి తొలగించేలా చేసింది. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చీటింగ్ 420 పేరుతో ఆ వీడియోలు మరోసారి సర్క్యులేట్ అవడంతో బాధితురాలు షాక్ తిన్నది. అంతేకాదు,తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతుండటం,వేధింపులకు గురిచేస్తుండటంతో ఈసారి బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ ఐపీ అడ్రెస్ ఆధారంగా కేసును చేధించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వరుణ్,కౌశిక్‌లను అరెస్ట్ చేసి కేసులు బుక్ చేసిన పోలీసులు... ఆ ఇద్దరు యువతులు,ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్టు చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+