వైసీపీ మహిళా నేత రేవతి మెడకు మరో వివాదం: మేనల్లుడి వీరంగం: ఆసుపత్రి సిబ్బందిపై దౌర్జన్యం
గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతి మెడకు మరో వివాదం చుట్టుకుంది. ఇప్పటికే కాజా టోల్‌గేట్ వద్ద చోటు చేసుకున్న ఘటనతో వివాదాలు, కేసుల్లో కూరుకునిపోయిన ఆమె పేరు..మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. టోల్‌గేట్ వివాదం చల్లారక ముందే.. మేనల్లుడి రూపంలో మరో గండాన్ని ఎదుర్కొంటున్నారామె. వెంటవెంటనే చోటు చేసుకున్న ఈ పరిణామాలు దేవళ్ల రేవతిని రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టోల్‌గేట్ సిబ్బందిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలోకి విడుదలైన కొన్ని గంటల్లోనే మరో వివాదం ఆమెను ఉక్కిరిబిక్కిరికి గురి చేసినట్టయింది.
తాజాగా- దేవళ్ల రేవతి మేనల్లుడు గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలోని ఓ నర్సింగ్ హోమ్‌లో వీరంగం సృష్టించాడు. ఆసుపత్రి సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చేయి చేసుకున్నాడు. అతని పేరు వడియా రాజు. దేవళ్ల రేవతికి సమీప బంధువు. కాజా టోల్‌ప్లాజా వద్ద దేవళ్ల రేవతి సృష్టించిన వీరంగం తరహాలోనే అతను కూడా దాచేపల్లి ఆసుపత్రి సిబ్బందిపై రెచ్చిపోయాడు. సిబ్బందిని కొట్టాడు. దీనికి సంబంధంచిన దృశ్యాలు ఆసుపత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఇదే ఆసుపత్రిలో అతను చికిత్స పొందాడు. అనంతరం డిశ్చార్జి చేసే సమయంలో బిల్లు మొత్తం గురించి నర్సింగ్‌హోమ్ సిబ్బందితో ఘర్షణకు దిగాడు. అధిక బిల్లులను వేశారని వాదించాడు. తాను అంత మొత్తాన్ని చెల్లించేది లేదంటూ భీష్మించాడు.. వారితో గొడవ పెట్టుకున్నాడు. దీనితో వడియారాజు, నర్సింగ్‌హోమ్ సిబ్బంది మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీనితో ఆగ్రహించిన వడియారాజు.. ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశాడు. సిబ్బందిని కొట్టాడు. తాను వైసీపీ నాయకుడినని బెదిరింపులకు గురి చేసినట్లు నర్సింగ్ హోమ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. అకారణంగా అతను తమపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వాపోతున్నారు.
Recommended Video
వైసీపీ మహిళా నేత రేవతి మెడకు మరో వివాదం: మేనల్లుడి వీరంగం: ఆసుపత్రి సిబ్బందిపై దౌర్జన్యం#Ysrcp #Revathi #Guntur pic.twitter.com/eB3U0I9Yyy
— oneindiatelugu (@oneindiatelugu) December 11, 2020
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications