జగన్ రాజ్యంలో దళిత విద్యార్థి అరణ్య రోదన: పీహెచ్‌డీ స్కాలర్‌కు తప్పని వేధింపులు: లోకేశ్
జగన్ రాజ్యంలో దళితులకు వేధింపులు తప్పడం లేదు. రోజుకొకరు చొప్పున వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఆంధ్రా వర్సిటీలో కుల వివక్షపై గళమెత్తిన స్కాలర్ ఆరేటి మహేశ్‌పై యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కక్షసాధింపు చర్యలకు దిగారు. వర్సిటీలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటంతో కక్షగట్టి.. హరాస్ చేస్తున్నారు. వర్సిటీల్లో కుల వివక్ష చూపించడం ఏంటీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు.
వర్సిటీలో కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆరేటి మహేష్‌పై వీసీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం జగన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. పీహెచ్‌డీ ఫైల్ ఆపి మహేష్‌ని గత 40 రోజులుగా వేధిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఉన్నత చదువు అభ్యసించి, ఉన్నత స్థానంలో ఉండాల్సిన దళిత బిడ్డ నడిరోడ్డుపై న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నాడని గుర్తుచేశారు.

Recommended Video
30 గంటలు దాటినా స్పందించకుండా ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరేటి మహేష్‌కి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహేష్‌పై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు.
దళితులపై @ysjagan దమనకాండ కొనసాగుతోంది. యూనివర్సిటీల్లో కుల వివక్ష దారుణం. ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆరేటి మహేష్ పై ఉపకులపతి కక్ష సాధింపు చర్యలకు దిగడం జగన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనం.(1/3) pic.twitter.com/pM7bFlSGqL
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 11, 2020
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications