కోడెల కూతురికి ఊరట..! ఆ కేసులో అరెస్ట్ చేయొద్దంటూ కోర్ట్ ఆదేశాలు..!!

అమరావతి/హైదరాబాద్ : అనుగాని చోట అదికులం అని విర్రవీగితే ఏమౌతుందే ఏపి రాజకీయాల్లో కోడెల కుటుంబమే ఉదాహరణ. ఏపీ మాజీ స్పీక‌ర్, రాజ‌కీయ దురంధ‌రుడు కోడెల శివ‌ప్రసాద‌రావు కుటుంబం చుట్టూ ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌యల‌క్ష్మి, కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణల‌పై ఇప్పటికే గుంటూరులోని ప‌లు పోలీస్ స్టేష‌న్లలో కేసులు న‌మోద‌య్యాయి. నిజానికి మూడు ద‌శాబ్దాల‌కు పైగా కోడెల కుటుంబం రాజ‌కీయాల్లో ఉంది. అనేక ప‌ద‌వులు కూడా అనుభ‌వించారు. న‌ర‌స‌రావుపేట కేంద్రంగా కోడెల చేసిన రాజ‌కీయాలు అంద‌రికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌త్తెనప‌ల్లి నుంచి గెలిచి, స్పీక‌ర్‌ ప‌ద‌విని అందుకున్నారు.

జిల్లాలో బలవంతపు వసూళ్లు..!హద్దు లేకుండా వ్యవహరించిన కోడెల కొడుకు,కూతురు..!!

జిల్లాలో బలవంతపు వసూళ్లు..!హద్దు లేకుండా వ్యవహరించిన కోడెల కొడుకు,కూతురు..!!

ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయ‌న కుటుంబంలోని కూతురు, కొడుకు రెచ్చిపోయార‌ని అప్పట్లోనే పుంఖాను పుంఖాలుగా వార్తలు వ‌చ్చాయి. అయితే వీటిపై ఫిర్యాదు చేసేందుకు ఎవ‌రూ ముందుకురాని ప‌రిస్థితి అప్పట్లో నెల‌కొంది. టీడీపీ అధికారంలో ఉండ‌డం, కోడెల రాజ్యాంగ బ‌ద్ధమైన స్పీక‌ర్ ప‌ద‌విలో ఉండ‌డంలో కేసులు న‌మోదు చేసేందుకు కూడా పోలీసులు జంకారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది.

వైసిపి ప్రభుత్వ హెచ్చరికలతో మాయమైన కోడెల సంతానం..! కూతురు కు అనుకూలంగా తీర్పు..!!

వైసిపి ప్రభుత్వ హెచ్చరికలతో మాయమైన కోడెల సంతానం..! కూతురు కు అనుకూలంగా తీర్పు..!!

అవినీతి కూక‌టి వేళ్లతో పెక‌లిస్తానంటూ.. సీఎంగా ప్రమాణం చేసిన రోజునే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రక‌టించ‌డంతో ఆయన‌పై ఉన్న భ‌రోసాతో ఇప్పుడు కోడెల కుటుంబం అరాచ‌కాల‌కు బ‌లైపోయిన వారు ఒక్కొక్కరుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అపార్ట్‌మెంట్ బిల్డర్ల నుంచి భారీ ఎత్తున కోడెల కుమారుడు క‌మీష‌న్లు గుంజుకున్నాడ‌ని, దీంతో ప‌నులు కూడా ఆపుకున్నామ‌ని, కొంద‌రు బిల్డర్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిన్న మొన్నటి వ‌ర‌కు కేసులు పెట్టేందుకు, ఫిర్యాదు చేసేందుకు వెనుక‌డుగు వేసిన వారు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వ‌స్తున్నారు.

కోడెల అదికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ దందాలు..!ప్రజలకు చుక్కలు చూపించిన కొడుకు,కూతురు.!!

కోడెల అదికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ దందాలు..!ప్రజలకు చుక్కలు చూపించిన కొడుకు,కూతురు.!!

ఈ క్రమంలోనే ఇక‌ తాము కొనుగోలు చేసిన పొలాలు త‌మ‌వంతూ కోడెల కుమార్తె భారీ ఎత్తున త‌మ నుంచి డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని మ‌హిళ తాజాగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కోడెల కుటుంబంపై కేసులు న‌మోద‌య్యాయి. వాస్తవానికి కుమారుడు, కూతురు చేస్తున్న ఆగ‌డాలు కోడెల ఎప్పుడో ప‌సిగ‌ట్టారు. ఆయ‌న‌కు వ్యతిరేకంగా వివిధ ప‌క్షాల నాయ‌కులు గుంటూరులో ధ‌ర్నాల‌కు దిగిన‌ప్పుడే ఆయ‌న‌కు అస‌లు విష‌యం తెలిసింది. దీంతో ఆయ‌న వీరిద్దరినీ హెచ్చరించారు కూడా. అయినా కూడా ఈ ఇద్దరూ ఆయ‌న మాట‌ల‌ను ప‌ట్టించుకోలేదు. ఫ‌లితంగా ఇప్పుడు కేసుల ఉచ్చుతో కోడెల ఫ్యామిలీ అల్లాడుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులు ఎటు దారి తీస్తాయో చూడాలి.

అట్రాసిటీ కేసులో విజయ లక్ష్మిని అరెస్టు చేయొద్దు..! కీలక ఉత్తర్వులిచ్చిన హైకోర్టు..!!

అట్రాసిటీ కేసులో విజయ లక్ష్మిని అరెస్టు చేయొద్దు..! కీలక ఉత్తర్వులిచ్చిన హైకోర్టు..!!

ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ స్పీకర్, టీడీపీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు కుటుంబీకులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోడెల కుమారుడు శివరాం, కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మిలపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొన్నిరోజుల క్రితం కోడెల కుమార్తె విజయలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదవగా, ఆ కేసును కొట్టివేయాలని లక్ష్మి తరఫున సీనియర్ అడ్వొకేట్ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగింది 2018 జనవరిలో అయితే, ఫిర్యాదు చేసింది 2019 జూన్ లో అని, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న హైకోర్టు విజయలక్ష్మిని ఈ కేసులో అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీచేసింది. వరుసగా కేసులు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కోడెల కుమార్తెకు ఇది ఊరటేనని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+