ఏ తప్పు చేశా.. స్టేషన్లు తిప్పి.. వదిలేయాల్సి వచ్చింది..?: నారా లోకేశ్

రమ్య మర్డర్ కేసు ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి.. చివరకు పెదకాకాని పోలీస్ స్టేషన్ నుంచి వదిలేశారు. లోకేశ్‌పై పోలీసులు 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. లోకేశ్ విడుదలకు ముందు.. పోలీసులు లోకేశ్‌తో నోటీసులపై సంతకం పెట్టించుకున్నారు. లోకేశ్‌ను తమ కాన్వాయ్ లోనే తరలించి, పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్లలో తిప్పినట్టు తెలుస్తోంది. పెదనందిపాడు, పొన్నూరు, గుంటూరు మీదుగా తరలించారు.

ఏ తప్పు చేశా..

ఏ తప్పు చేశా..

పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత నారా లోకేశ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఏం తప్పు చేశానని అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి 8.30 గంటల వరకు అనేక స్టేషన్లు తిప్పారని మండిపడ్డారు. విద్యార్థిని రమ్య కుటుంబానికి అండగా నిలబడడం మేం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేయలేదు కాబట్టే 151 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారని లోకేశ్ వెల్లడించారు.

గన్ కన్నా.. జగన్ ముందు..? మరీ

గన్ కన్నా.. జగన్ ముందు..? మరీ


రమ్య హత్య జరిగితే... గన్ కన్నా ముందు వస్తాడన్న జగన్ ఎక్కడికెళ్లారని లోకేశ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత జగన్ రెడ్డి స్పందించడం బాధాకరమని పేర్కొన్నారు. "దిశ చట్టం తెచ్చామని మీరు చెబుతున్నారు. 20 రోజుల్లో గనుక రమ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే 21వ రోజున టీడీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

హత్యకు కారణమిదే..

హత్యకు కారణమిదే..

సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయమే రమ్య హత్యకు దారితీసిందని ఇన్‌ఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌ తెలిపారు. నిందితుడు శశికృష్ణకు, రమ్యకు ఆర్నెల్ల కిందట ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రేమించాలని రమ్య వెంటపడేవాడని, రెండు నెలలుగా మితిమీరి వేధించాడని తెలిపారు. దాంతో శశికృష్ణతో రమ్య మాట్లాడడం మానేసిందని, ఇది మనసులో పెట్టుకున్న శశికృష్ణ పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. చివరికి నిన్న ఆమెతో వాగ్వాదం జరిగిన అనంతరం కత్తితో నరికి చంపాడని తెలిపారు.

అడ్డుకొని ఉంటే..

అడ్డుకొని ఉంటే..

స్థానికులు అడ్డుకుని ఉంటే రమ్య బతికుండేదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల పట్ల యువత దూరంగా ఉంటే మేలని హితవు పలికారు. ఇలాంటి పరిచయాలను ఆసరాగా చేసుకుని వేధించే వాళ్లపై ఫిర్యాదు చేయాలని, రమ్య కూడా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమోనని ఇన్చార్జి డీఐజీ అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మృతురాలి ఫోన్ డేటా నుంచి డిలీట్ అయిన వివరాలను కూడా రాబట్టి, దర్యాప్తును ముందుకు తీసుకెళతామని అన్నారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి చైతన్యం కలిగించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారని వెల్లడించారు.

దారుణం

దారుణం

స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్‌ విద్యార్థిని రమ్యను శశికృష్ణ అనే యువకుడు అతి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+