చివరకు సైకిల్ ఎక్కిన పవన్..తమ్ముడి కోసం తప్పలేదు..!
Pawan Kalyan: ఏపీలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భాకరాపురంలో ఆయన ఓటు వేశారు. ఇక్కడి జయ మహల్ ప్రాంతంలో గల ఆంగన్వాడి పోలింగ్ బూత్ నంబర్ 138లో ఆయన కొద్దిసేపటి కిందటే ఓటు వేశారు.
మరోవంక- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారాయన. కొద్దిసేపు క్యూలో నిల్చున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య భువనేశ్వరితో కలిసి మంగళగిరి నియోజకవర్గంలో ఓటు వేశారు.
తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారాయన. అప్పటికే ఓటర్లు బారులు తీరి నిల్చోవడంతో వారితో కలిసి కొద్దిసేపు ఎదురు చూశారు. తనవంతు వచ్చేంత వరకూ క్యూ లైన్‌లోనే నిల్చున్నారు. అనంతరం ఓటు వేశారు.
ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వంగా గీతాపై ఆయన పోటీ చేశారు. పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో ఓటు హక్కు లేదు. మంగళగిరిలో ఆయనకు ఓటు ఉంది. అందుకే ఆయన ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వచ్చింది.
విజయవాడ వైఎస్ఆర్సీపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేశినేని నాని కొద్దిసేపటి కిందటే ఓటు వేశారు. తన భార్య పావని, ఇద్దరు కూతుళ్లు హైమా, శ్వేత, అల్లుళ్లతో కలిసి నాని ఓటు హక్కును వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications