గుంటూరులో చిన్నారిపై అత్యాచారం చేసిన ఇంటర్ విద్యార్థి అరెస్ట్.. పోక్సో కేసు నమోదు... ఫాస్ట్‌ట్రాక్

గుంటూరులో శుక్రవారం ఐదైళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఇంటర్ విద్యార్థి లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు దృవికరించారు. లక్ష్మారెడ్డిపై పోక్సో, అట్రాసిటి, కేసులు నమోదు చేసినట్టు గుంటూరు ఎస్పీ రామక్రిష్ణ తెలిపారు. కాగా కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మగపిల్లలు ఎప్పుడు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు. ఇలాంటీ వాటిని అరికట్టేందుకు కాలేజీల్లో నిఘాను పెంచినట్టు చెప్పారు.

ఏపీలో మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు దిశ చట్టానికి సవరణలు తెచ్చి అసెంబ్లీలో చర్చించి పెట్టి ఆమోదించిన రోజే... గుంటూరు జిల్లాలో మరో చిన్నారీపై ఇంటర్ చదువుతున్న యువకుడు లక్ష్మారెడ్డి అత్యాచారానికి ఒడిగట్టాడు. లక్ష్మారెడ్డి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న చిన్నారీపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని ఇంట్లోవారికి కూడ చెప్పవద్దని హెచ్చరించాడు. అయితే తరచు చురుకుగా ఉండే చిన్నారీ అనారోగ్యంగా కనిపించడంతో ఆమె కుటుంబసభ్యులు ఆరా తీశారు. జరిగిన విషయాన్ని బాలిక చెప్పింది. మరోవైపు ఈ విషయం ఎవరికి చెప్పవద్దని అన్నయ్య చెప్పాడని.. అదే సమాధానాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే అదృష్టవశాత్తు పాపకు ఏమీ కాలేదని , ఏదైనా జరిగి ఉంటే ఎవరు భాద్యత వహిస్తారని పాప తల్లిదండ్రులు ప్రశ్నించారు. అయినా... అఘాయిత్యానికి పాల్పడిన యువకుడి తల్లిమాత్రం తమకు ఏమీ కాదని, తన కొడుకు ఇంట్లోనే ఉన్నాడని చెబుతుందని వాపోయింది. పోలీసులు సంఘటనను సీరియస్‌గా తీసుకుని నిందితున్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.

Rape accused was arrest in Guntur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+