వామ్మో.. మందు బాటిల్‌లో పాము పిల్ల, అవాక్కయిన మందుబాబులు.. ఎక్కడ అంటే
మందుబాబులకు ఓ బాటిల్ చుక్కలు చూపించింది. అవును అందులో పాము పిల్ల ఉంది. దీంతో అవాక్కవడం అతని వంతయ్యింది. గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగంది. పొన్నూరులో మద్యం సీసాలో పాము పిల్ల కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అంతా ఏంటీ అని ముక్కున వేలేసుకున్నారు.
పొన్నూరుకు చెందిన కొందరు యువకులు బాపట్ల బస్టాండ్‌లోని ప్రభుత్వ మద్యం షాప్‌లో ఫుల్‌బాటిల్ కొనుగోలు చేశారు. బాటిల్‌ను ఓపెన్ చేసి చూస్తే..ఓ పాము పిల్ల అందులో కనిపించింది.ఒక్కసారిగా అవాక్కైన యువకులు దానిని వీడియో తీశారు. అనంతరం ఇతరులకు తెలియజేశారు.

యువకులు వెంటనే సదరు వైన్ షాపు వద్దకు వెళ్లి అసలు విషయాన్ని చెప్పారు. తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ బదులు వేరే బాటిల్ ఇవ్వమని కోరగా అందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో యువకులు షాపు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ర్వాత షాపు యజమాన్యం రాజీకి వచ్చింది. మరో ముందు మద్యం బాటిల్ ఇచ్చి యువకులను అక్కడి నుంచి పంపించి వేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పొన్నూరులో మందుబాబులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదీ నిజమేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. పాము పిల్ల కనిపించడం ఏంటీ అని షాక్ తిన్నారు. చీకట్లో తాగితే పరిస్థితి ఏంటీ అని అంటున్నారు. సో.. మందుబాబులను కూడా ఈ వీడియో ఆలోచింపజేసింది. మందు తాగకుంటే సరిపోతుంది.. కానీ వారు అలా ఉండరు. మరో బాటిల్ నిశీతంగా పరిశీలించి మరీ కొనుగోలు చేస్తారు. మద్యం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా సమకూరుతుంది.












Click it and Unblock the Notifications