కీచక టీచర్: విద్యార్థులతో అసభ్య ప్రవర్తన, పేరెంట్స్ ఆందోళన, ఎంఈవో విచారణ
విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ దారితప్పాడు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పేరెంట్స్ ఆందోళనతో పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో రాధాకృష్ణ టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే అతను విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. టీచర్ వేధింపుల గురించి వారు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. టీచర్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు కూడా స్పందించారు.

పేరెంట్స్ ఫిర్యాదుపై ఎంఈవో స్పందించారు. విచారణ జరిపి టీచర్ రాధాకృష్ణపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు శాంతించారు. విద్యార్థులతో అతని ప్రవర్తన సరిగాలేదని ప్రజాసంఘాల నేతలు తప్పుపట్టారు. శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరారు. మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు కూడా టీచర్ వైఖరి సరికాదని దుయ్యబట్టారు.
సమాజంలో టీచర్‌కు మంచి స్థానం ఉందని విద్యార్థి నేతలు చెప్తున్నారు. వారి గౌరవం ఇనుమడింపజేసుకోవాలే తప్ప.. ఇలా ప్రవర్తించడం సరికాదంటున్నారు. ఒక్కరు చేసే తప్పు వ్యవస్థకు వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications