గిరిజన మహిళా రైతు హత్య..?: ట్రాక్టర్‌తో తొక్కించిన వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్..?
గిరిజన రైతు రమావత్ మంత్రూబాయిని ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ట్రాక్టర్ తో తొక్కించిన శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో మృతురావలి బంధువులు శాంతించారు. అంతకుముందు మంగళవారం ఉదయ నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రమావత్ బంధువులు ఆందోళన చేపట్టారు. నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వారి ఆందోళన నేపథ్యంలో పోలీసులు స్పందిస్తూ.. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
గుంటూరు జిల్లా నకరికల్లు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రూబాయి, మంత్రూనాయక్ భార్యాభర్తలు. అటవీభూముల్లో సాగుచేసుకుంటున్నారు. అలా రెండున్నర ఎకరాల భూమిపై హక్కులు పొందారు. రెండేళ్ల కిందట ఆ పొలం పనులు, ఇంటి అవసరాల నిమిత్తం అప్పు తీసుకున్నారు. నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి రూ.3.80 లక్షలు అప్పు ఇఛ్చాడు. తీసుకున్న అప్పు, వడ్డీ తీర్చకపోవడంతో.. శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై ఇద్దరికీ గొడవలు కూడా జరిగాయి.

Recommended Video
అప్పు తీర్చకపోగా.. పొలంలో పనులు చేసుకునేందుకు రమావత్ దంపతులు వెళుతున్నారు. దీంతో కోపం పెంచుకున్న శ్రీనివాసరెడ్డి.. మంత్రూబాయి, మంత్రూనాయక్‌ను తన ట్రాక్టర్‌తో అడ్డుకున్నాడు. మాటామాటా పెరగడంతో ట్రాక్టర్‌తో మంత్రూబాయిని తొక్కించాడు. దాంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఘటనపై నారా లోకేశ్, టీడీపీ అనిత కూడా మండిపడ్డారు. జే గ్యాంగ్ అరాచకాలు అంటూ ధ్వజమెత్తారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications