• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గుంటూరులో ఘోరం: గర్ల్‌ఫ్రెండ్ నగ్న వీడియో.. పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్: దిశ చట్టం ప్రయోగం

|

గుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతికి మత్తుమందు ఇచ్చి, నగ్నంగా వీడియో తీసి, దాన్ని ఇన్‌స్టాగ్రామ్, పోర్న్‌సైట్లలో అప్‌లోడ్ చేసిన కేసును గుంటూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు. 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల తరువాత నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మూడేళ్ల కిందట గుంటూరుకు చెందిన విద్యార్థినికి వరుణ్‌ అన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వరుణ్ తరచూ ఆమెను తన కంబైన్డ్ స్టడీస్ పేరుతో తన ఫ్లాట్‌కు పిలిపించుకునే వాడు. ఆ సమయంలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి.. ఆమెపై అత్యాచారం చేశాడు. వాటిని చూపించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. సుమారు రెండు లక్షల రూపాయల వరకు బాధితురాలి నుంచి వసూలు చేసినట్లు తేలింది.

ఈ ఘటనతో బాధితురాలు వరుణ్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌ను తెంచుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఇంజినీరింగ్ కళాశాలలో కౌశిక్ అనే మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నేపథ్యం గురించి ఆరా తీయగా.. వరుణ్‌తో రిలేషన్ ఉన్నట్లు తేలింది. అనంతరం వరుణ్‌, కౌశిక్ ఇద్దరూ బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేయసాగారు. వారిద్దరూ తమ వద్ద ఉన్న వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు.

Two engineering students held for circulating objectionable videos in Guntur

ఈ విషయం తెలిసిన యువతి బంధువులు వరుణ్‌, కౌశిక్‌‌లను కలిశారు. వారు అడిగిన డబ్బులను ఇచ్చారు. అశ్లీల వీడియోలను ఇంటర్నెట్‌ నుంచి తీసేయించారు. కొద్ది రోజుల కిందట అవే వీడియోలు మళ్లీ ఓ పోర్న్‌సైట్‌లో కనిపించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. పోర్న్‌సైట్ సహా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కనిపించాయి. దీనితో వారు పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వరుణ్, కౌశిక్‌లను అరెస్టు చేశారు. వారిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్ధరు ఇంజినీరింగ్ విద్యార్దులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. 2017 నుంచి వారిద్దరూ బాధితురాలి నగ్న ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌ అప్‌లోడ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు.

మొదట యువతి నగ్న వీడియో, చిత్రాలను తీసి నెట్‌లో పెట్టి తాత్కాలికంగా డిలీట్ చేశారని, ఆ యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉండటంతో వరుణ్ ఆ నగ్న వీడియోలను కౌశిక్‌కు చూపించాడని, అనంతరం వారిద్దరూ కలిసి యువతి వీడియోలను పోర్న్ సైట్ పెట్టారని అమ్మిరెడ్డి చెప్పారు. యువతికి మెయిల్స్ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, వరుణ్, కౌశిక్‌లను అరెస్టు చేశామని చెప్పారు.

English summary
Guntur police arrested two youths on Saturday for allegedly circulating a girl’s nude video on Instagram and a prominent porn website. According to the DSP of Disha police station Lakshminarayana and SP Ammireddy, the two accused are engineering students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more