సొంత పార్టీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే యుద్ధం .. వారి అంతు చూస్తా అంటున్న ఎమ్మెల్యే రజని
చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడదల రజిని సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తనను వెన్నుపోటు పొడవాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ రోజూ సంతోషంగా లేను అని చెప్పిన ఆమె అది ప్రతిపక్షాల వల్ల కాదు, సొంత పార్టీ నేతల వల్లే అంటూ తేల్చి చెప్పారు.

కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రజనీ వ్యాఖ్యలు
చిలకలూరిపేట పట్టణంలోని ఎస్‌ఎంఎస్ గార్డెన్స్‌లో వైసీపీ నేతలు కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో మాట్లాడిన ఆమె చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని తేటతెల్లం చేస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలైనా ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజని అన్నారు. సొంత పార్టీలోని వ్యక్తులే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంతపార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడిన ఎమ్మెల్యే రజని
ఇక తన వెంటే ఉంటూ తనను వెన్నుపోటు పొడవాలని చూస్తున్న వారి అంతు చూస్తా అని విడదల రజిని హెచ్చరించారు. చిలకలూరిపేటలో అవినీతిని తరిమేయాలని లక్ష్యంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరానని చెప్పిన విడదల రజిని తనను టార్గెట్ చేస్తున్న వాళ్ళ అంతు చూస్తానని హెచ్చరించారు. ఆడపిల్లనైనప్పటికీ తాను నాలుగు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన జోలికి వస్తే అంతు చూస్తా అని హెచ్చరిక
తను నిజాయితీగా సేవలందించడానికి ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పిన రజిని, తన జోలికి వచ్చిన వారి అంతు చూసేవరకు విడిచిపెట్టేది లేదని ఇదే తన నైజమని స్పష్టంచేశారు. చిలకలూరిపేటలో అవినీతి రహిత పాలన సాగించడానికి తన వంతు ప్రయత్నంగా రాజకీయాల్లోకి వచ్చిన తన కలను నాశనం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పిన రజిని, ఆ దుష్ట శక్తుల ఆటలు చెల్లవని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలతో కాదు యుద్ధం స్వపక్షంతోనే అంటున్న ఎమ్మెల్యే విడదల రజనీ
గత ఎన్నికలలో తన గెలుపే నిజాయితీ గెలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనమని ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద పోటీ చేసి రజనీ వ్యాజ్యం సాధించారు. ప్రతిపక్ష పార్టీతో, మాజీ మంత్రితో పోరాటానికి తానెప్పుడూ సిద్ధమని కానీ, సొంత పార్టీ నేతలతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోందని ఆమె సభాముఖంగా తెలిపారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అంతర్గత కలహాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. రజనీ వ్యాఖల నేపధ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతుంది అన్న చర్చ జోరుగా సాగుతుంది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications