health tips: శీతాకాలంలో కొబ్బరినూనెతో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే వాడకుండా ఉండరు!!

మారుతున్న కాలంలో చాలామంది కొబ్బరి నూనె వాడకాన్ని గణనీయంగా తగ్గించారు. కొబ్బరి నూనె లో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి అని మరచిపోతున్నారు. మన చర్మాన్ని, జుట్టు ను మాత్రమే కాకుండా కొబ్బరినూనె, అనేక నొప్పుల నివారణి గా కూడా పని చేస్తుందని, చర్మం పొడిబారకుండా కాపాడుతుందని చెబుతున్నారు. కొబ్బరి నూనె ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా నిత్యం కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కొబ్బరి నూనెలో విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

కొబ్బరి నూనెలో విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

కొబ్బరి నూనె ఒకప్పుడు నిత్యం జుట్టుకు పెట్టుకోవడానికి,ఒంటికి రాసుకోవడానికి పెద్ద వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేవారు.ఇకప్రస్తుత కాలంలో చాలా మంది కొబ్బరి నూనెకు బదులు శరీరానికి పెట్టుకోవడానికి క్రీములు, జుట్టు హెయిర్ జల్స్ వాడుతున్నారు.కానీ మనం ఉపయోగించే క్రీములు, హెయిర్ జెల్స్ కొబ్బరినూనెకుఏమాత్రం సాటి రావని చెప్పవచ్చు.కొబ్బరినూనెలో విటమిన్ సి ఉంటుంది.అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీని కారణంగా కొబ్బరినూనెఒంటికి రాసుకుంటే చర్మంస్మూత్ గా ఉండటమే కాకుండా,మెరిసిపోతుంది.ఇక జుట్టుకు రాసుకుంటే జుట్టు నిగారింపును సంతరించుకుంటుంది.దీని ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి.

శీతాకాలంలో కొబ్బరి నూనె చేసే మేలు అంతా ఇంతా కాదు

శీతాకాలంలో కొబ్బరి నూనె చేసే మేలు అంతా ఇంతా కాదు


శీతాకాలంలో చర్మం పొడిగా మారడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.కాళ్ళ పగుళ్లు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.ఇక అటువంటి సమయంలో చర్మం పొడిబారకుండా,కాళ్ళ పగుళ్లు రాకుండా కాపాడటంలో కొబ్బరినూనె గణనీయమైన పాత్ర పోషిస్తుంది.ఇక రాత్రి వేళల్లో కాళ్లు మంటలతోఇబ్బంది పడేవారు కొబ్బరి నూనె రాసుకుంటే కాళ్లమంటల నుండి ఉపశమనం పొందుతారు.అంతేకాదు చలికాలంలో వచ్చే వివిధ నొప్పులకు కొబ్బరి నూనె ఒక నివారిణిగా పనిచేస్తుంది.శరీరంపైఎక్కడ నొప్పి కలిగినాకొబ్బరి నూనెరాసుకోవచ్చు.ఇక కొబ్బరి నూనె బరువు తగ్గడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే కొబ్బరినూనెను వాడి చూడండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే కొబ్బరినూనెను వాడి చూడండి


బరువు తగ్గాలని భావించేవారు వంట నూనెగా కొబ్బరినూనె ఉపయోగిస్తే కొబ్బరి నూనె లోని సంతృప్త కొవ్వు మన బరువు తగ్గడానికి సహకరిస్తుంది.భోజనంలో తక్కువ కేలరీలు తీసుకునే లాగా కొబ్బరి నూనె ఎంతగానో సహాయపడుతుంది.ఇక కాలేయానికి సంబంధించిన జబ్బులతో బాధపడేవారికి కొబ్బరి నూనెతో చేసిన ఆహారంమేలు చేస్తుందని చెబుతారు.కొబ్బరి నూనె ను మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను కొబ్బరినూనె బాగా తగ్గిస్తుంది.

కొబ్బరినూనెను జీవితంలో భాగం చేసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం

కొబ్బరినూనెను జీవితంలో భాగం చేసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం


కొబ్బరి నూనెను మన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీర ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.కొబ్బరి నూనె లో ఉండే పోషకాలతో డిప్రెషన్ నుండి బయటపడవచ్చు.మన జీవితంలో కొబ్బరినూనెను ఒక భాగం చేసుకోవడం వల్ల, కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగించడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవని చెబుతున్నారు.ఇక చర్మానికి సంబంధించిన రకరకాల సమస్యలకు రకరకాల కెమికల్స్ తో తయారు చేసినక్రీమ్లను తెచ్చి ఉపయోగించుకునేబదులు,నిత్యం కొబ్బరినూనెను వాడి చూడండి.ఆ తర్వాత తేడా మీరే గమనించండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+