Balakrishna: గొప్ప మనస్సు చాటుకున్న బాలయ్య.. వారికి ఫ్రీగా సర్జరీలు..!

నందమూరి బాలకృష్ణ గొప్ప నటుడే కాదు.. పెద్ద మనస్సున్న వ్యక్తి. ముఖ్యంగా నందమూరి తారకరత్న చనిపోయినప్పుడు ఆయనే అన్ని దగ్గరుండి చూసుకున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి కన్నుమూశాడు. అప్పుడు కూడా బాలకృష్ణ అన్ని తానై చూసుకున్నాడు.

తాజాగా బాలకృష్ణ తారకరత్న మృతి నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తమ కుటుంబం బాధపడినట్లుగా ఇతరులు బాధపడకూడాదని ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తారకరత్న పేరు మీద పేదలకు కార్డియాక్ అరెస్ట్ చోయార్సిక్ సర్జరీలు చేయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Balakrishna has decided to give free surgeries to the poor people

బాలకృష్ణ తన నియోజకవర్గంలో నిర్మించిన ఆస్పత్రిలో హెచ్ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఫారిన్ దేశాల నుంచి కోటీ 30 లక్షల రూపాయల పరికరాలను కూడా కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఆసుపత్రిలో చిన్న పిల్లలకు ఉచిత భోజనంతోపాటు కావాల్సిన మందులు కూడా 3 నెలల పాటు ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బాలకృష్ణ పెద్ద మనస్సును చూసిన ఆయన అభిమానులు బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తున్నారు.

ఇటీవల కార్టియాక్ అరెస్ట్ తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. చిన్న వయసులోనే ఉన్నట్లుండి చిట్టి గుండెలు ఆగిపోతున్నాయి. అప్పటివరకు తమతో ఎంతో సంతోషంగా ఆడిపాడినవాళ్లు క్షణాల్లోనే కళ్లముందు విగతజీవులుగా మారుతున్నారు. ఈ క్రమంలో పేద ప్రజలకు ఉచితంగా కార్టియాక్ అరెస్ట్.. తోయార్సిక్ అరెస్ట్ సర్జరీలు చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. పైకీ కటువుగా కనిపిస్తారు.. కానీ మనసు మాత్రం బంగారం అని అంటున్నారు అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+