కోపంతో ఊగిపోయిన బాలయ్య... అభిమాని చెంప చెళ్లు... హడలిపోయిన టీడీపీ శ్రేణులు...

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి పట్టరాని కోపంతో ఊగిపోయారు. తన అనుమతి లేకుండా వీడియో తీసిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించారు.వెంటనే వీడియోని డిలీట్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో మాట్లాడుతుంటే ఇదేం పని అంటూ ఫైర్ అయ్యారు. బాలయ్య కోపంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు భయంతో హడలిపోయారు. హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య 9వ వార్డు అభ్యర్థురాలి ఇంటికి వెళ్లగా... అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జగన్‌పై బాలయ్య విమర్శలు...

జగన్‌పై బాలయ్య విమర్శలు...

అంతకుముందు,హిందూపురం వీధుల్లో బాలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వీడియో గేమ్‌లు ఆడుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తనలా బూతులు ఎవరూ తిట్టలేరని... కాబట్టి మంత్రులు తమ నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదని హెచ్చరించారు. తనకు సంస్కారం ఉందని... అందుకే గౌరవిస్తున్నానని చెప్పారు. కానీ ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని నడిపిస్తున్నది అధికారులు కాదు, మంత్రులు కాదు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబునే తిట్టేందుకే ఒక మంత్రి : బాలయ్య

రాష్ట్రంలో ఒక్కో మాఫియాకు ఒక్కో మంత్రిని ఏర్పాటు చేశారని బాలయ్య విమర్శించారు. కేవలం చంద్రబాబును బూతులు తిట్టేందుకే ఒక మంత్రిని నియమించారని... రెండేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను మూసివేసి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. వాలంటీర్లది ఒక చెత్త వ్యవస్థ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు,వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్ని రకాల పన్నులను పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ బడుగు,బలహీనవర్గాల పార్టీ : బాలయ్య

టీడీపీ బడుగు,బలహీనవర్గాల పార్టీ : బాలయ్య


హిందూపురం ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. అటు రాజకీయంగా ప్రజా సేవ చేయడంతో,బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితో పేద వర్గాలకు సేవ చేస్తున్నానని బాలయ్య హిందూపురం ప్రజలకు గుర్తుచేశారు. మరోవైపు సందేశాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నానని చెప్పారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేది టీడీపీ మాత్రమేనని అన్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+