మనీష్ సిసోడియాకు సుప్రీం షాక్-ఇది అవినీతి కేసు- హైకోర్టులోనే తేల్చుకోమని సూచన..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అరెస్టు చేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇవాళ సుప్రీంకోర్టు షాకిచ్చింది. లిక్కర్ స్కాంలో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. దీనిపై తదుపరి విచారణకు నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు అందుకుని మద్యం విధానంలో మార్పులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా సీబీఐ తీరును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసు విచారణపై స్టే ఇచ్చి, తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును సిసోడియా కోరారు. అయితే సుప్రీంకోర్టు దీనికి నిరాకరించింది. అయితే ఓ సలహా మాత్రం ఇచ్చింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు అవినీతి కిందకు వస్తుందని, కాబట్టి దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి విచారణ కోరాలని డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంకోర్టు సూచించింది. సిసోడియాపిటిషన్ పై ఇవాళ సాయంత్రం 3.50కి విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. అరగంట విచారణ తర్వాత దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై తాము విచారణ చేయబోమని తెలిపింది. ఈ కేసు అవినీతి కిందకు వస్తుంది కాబట్టి ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోమని సిసోడియాకు సలహా ఇచ్చింది. గతంలో వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిసోడియా తరఫు లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ ప్రస్తావించగా.. దాంతో ఈ కేసుకు సంబంధం లేదని క్లారిటీ కూడా ఇచ్చింది.












Click it and Unblock the Notifications