ఎల్ కే అద్వానికి భారతరత్న, మోదీ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ కోమాలోకి వెళ్లింది
భారత మాజీ ఉప ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, బీజేపీ భీష్ముడు లాల్ కృష్ణ అద్వానీ (ఎల్‌కే అద్వానీ)కి భారతరత్న అవార్డు లభించింది. దీని తర్వాత ఎల్‌కే అద్వానీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ ఎల్ కే అద్వానీకి భారతరత్న అవార్డును స్వాగతిస్తున్నామని అన్నారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, బీజేపీ భీష్ముడు ఎల్ కే అద్వానికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు మా అభినందనలు తెలుపుతున్నామని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అన్నారు. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ దేశ అత్యున్నత గౌరవానికి అర్హుడైన ఎల్ కే అద్వాని సేవలను గుర్తించి భారతరత్న అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
విధేయత, నిబద్ధత, స్నేహపూర్వకత, కృషి, పట్టుదలతో దేశ ఉప ప్రధాని అయిన ఎల్ కే అద్వానీ భారత రాజకీయాల్లో అందరికీ స్ఫూర్తిదాయకం అని, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ట్వీట్ చేశారు. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ ఎంపీ డీవీ సదానంద గౌడ కూడా లాల్‌కృష్ణ అద్వానీకి భారతరత్న ఇవ్వడం అభినందనీయమని, రామమందిరం కట్టినప్పుడు అద్వానీకి భారతరత్న ఇవ్వాలనే ఆలోచన ప్రధాని మోదీకి ముందు నుంచి ఉందని అన్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముందు ఎల్ కే అద్వానికి భారతరత్న పురస్కారం అందిస్తే లేనిపోని చర్చలకు దారితీసే అవకాశం ఉందని, అందుకే మోదీ అన్ని రకాలుగా ఆలోచించి రామమందిరం ప్రారంభం తరువాత భారతరత్నం అవార్డు ప్రకటించారని మాజీ సీఎం డీవీ సదానందగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా దేశ ప్రజలు పట్టించుకోరని సదానందగౌడ అన్నారు. అద్వానీకి భారతరత్న వచ్చింది కదా మీ అభిప్రాయంఏమిటని ఇప్పుడు కాంగ్రెస్ నేతలను అడగండి అంటూ సదానందగౌడ మీడియాకు సూచించారు.

రెండు రోజులు అయినా సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ కు ఎలాంటి మాటలు రావని, మోదీ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలి ఆ పార్టీ నాయకులు కోమాలోకి వెళ్లిపోయారని సదానందగౌడ వ్యంగంగా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బ ఏంటో కాంగ్రెస్‌కి ఇప్పుడు తెలిసిందని, ఇలాంటి దెబ్బ తగులుతుందని కాంగ్రెస్ పార్టీ అసలు ఊహించలేదని, ఆ పార్టీ నాయకులు బోర్లబక్కలా కింద పడ్డా మీసాలు మాత్రం మెలివేస్తారని మాజీ సీఎం సదానందగౌడ వ్యంగంగా అన్నారు.












Click it and Unblock the Notifications