పది సభలు పెట్టినా నో యూజ్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిన్న ప్రధాని మోడీ సభ జరిగింది. కమల దళం ఆహా ఓహో అని కామెంట్ చేసింది. దీనిపై అధికార టీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడింది. వారి సభలతో ప్రయోజనం ఏమీ లేదని కామెంట్ చేసింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజల విశ్వాసం చూరగొనలేదని కామెంట్ చేశారు. ఒక్కటి కాదు అలాంటివి పది సభలు పెట్టిన ఫలితం లేదని మండిపడ్డారు.
ఆ పార్టీ జనాల విశ్వాసం ఎప్పుడో కోల్పోయిందని చెప్పారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఇబ్బందికి గురిచేశారు. ఆ విషయం వారు మరచిపోరు అని స్పష్టంచేశారు. ఇక్కడికి వచ్చి రైతుల గురించి పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారు.. ఆయనకు మాట్లాడే హక్కు ఉందా అని అడిగారు. రైతులకు కలిగిన ఇబ్బందులకు కారణం వీరు కాదా అని అడిగారు. అదీ జనానికి తెలుసు అని.. వారు ఏమీ మరచిపోరని తెలిపారు.

ఇప్పుడే కాదు గత 8 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. సవతి తల్లిలా ప్రేమ చూపిస్తోందని ధ్వజమెత్తారు. కానీ పైకి మాత్రం నీతులు చెబుతుందని ఫైరయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఏం మాట్లాడుతారు అని అడిగారు. మోడీ జనాలను దారుణంగా మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. మోడీ చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు.
2014 ఎన్నికలకు ముందు మోడీ ఉద్యోగాల కల్పనపై కామెంట్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని కామెంట్ చేశారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని అడిగారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని మండిపడ్డారు. ఆ పార్టీ వారు తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారని మండిపడ్డారు. కానీ చేసేది ఏమీ ఉండదన్నారు.












Click it and Unblock the Notifications