తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
తెలంగాణకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 8,456 కరోనా పరీక్షలు నిర్వహించారు. 102 పాజిటివ్ కేసులు వచ్చాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 60 కేసులు వెల్లడయ్యాయి. పలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మరో 60 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.175 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు.

తెలంగాణలో ఇప్పటివరకు 8,35,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,29,840 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 1,116 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు. ఇటు దేశవ్యాప్తంగానూ కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి.












Click it and Unblock the Notifications