న్యూ ఇయర్ షాక్: నిలిచిపోనున్న 104 సేవలు.. మరీ సిబ్బందిని ఏం చేస్తారు...?
తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక సేవ క్లోజ్ అవనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకోవడంతో.. న్యూ ఇయర్ నుంచి ఆ సేవలు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. రోగులు ఉన్న చోటుకు వెళ్లి వైద్య సేవలు అందించే వాహనం 104.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు మందులిస్తారు రక్తపోటు, మధుమేహం, మూర్చ, ఆస్తమా తదితర వ్యాధులతోపాటు గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడ మందులు ఇస్తారు. నెలలో ఒక్కో వాహనం కనీసం 50 గ్రామాల్లో సేవలు అందిస్తుంది. జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాలు నిలిచిపోనున్నాయని సమాచారం.

104 సిబ్బందికి షాక్..
న్యూ ఇయర్‌లో 104 సిబ్బందికి సర్కారు షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటికే వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో ఉన్న అన్ని 104 వాహనాలను హైదరాబాద్‌కు పంపాలని ఆదేశాలు జారీచేసింది. మెజారిటీ వాహనాలు ఇప్పటికే హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నాయి. సిబ్బంది అంతా డీఎంహెచ్‌వో పరిధిలో పని చేస్తుండడంతో వారితో సమీక్ష నిర్వహించి, తొలగించాలా వద్దా అన్న అభిప్రాయాలను తీసుకుంది.

1375 సిబ్బంది
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. 2008 అక్టోబరులో 104 వాహన సేవలను ప్రారంభించారు. తొలుత హెచ్‌ఎమ్‌ఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో వీటి సేవలు కొనసాగాయి. తెలంగాణలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో కేవలం 120 వాహనాలే సేవలందిస్తున్నాయి. మిగతావన్నీ రిపేర్లు వచ్చి మూలనపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 సేవల కింద దాదాపు 1,375 మంది వరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలు అందిస్తున్నారు. ఒక్కో వాహనంలో డ్రైవర్, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరు గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.

ఎక్కడికి పంపిస్తారు...?
ఈ సేవలను నిలిపివేయడంతో వారందర్నీ ఏంచేస్తారనే అంశానికి సంబంధించి వైద్య శాఖ వద్ద ఇప్పటి వరకు స్పష్టంచేయలేదు. ప్రస్తుతం వీరిని పీహెచ్‌సీల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సోమవారం 104 సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమను జాతీయ ఆరోగ్య మిషన్‌లో కాంట్రాక్టు పద్ధతి కింద తీసుకోవాలని కోరారు. వారి విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎన్‌హెచ్‌ఎంలో డ్రైవర్ పోస్టులు లేవు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications